షాకింగ్ న్యూస్... భారత గబ్బిలాల్లో కరోనా వైరస్

By telugu news team  |  First Published Apr 15, 2020, 7:55 AM IST
ఈ రెండు రకాల గబ్బిలాలను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్, రౌసెటస్ గా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ రెండు జాతులకు చెందిన 25 గబ్బిలాల నమూనాల్లో కరోనా వైరస్ కనిపించింది.
 

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ గబ్బలాల నుంచే మనుషులకు పాకిందని.. వాటిని తినడం వల్లే చైనాలోఈ వైరస్ వృద్ధి చెందిందని నిపుణులు చెబుతూ వచ్చారు. అయితే.. తాజాగా ఈ వైరస్ భారత్ లో నివసించే రెండు రకాల గబ్బిలాల్లో కూడా కనిపించడం గమనార్హం.
 
వీటిలో ఈ సూక్ష్మ జీవులను గుర్తించడం ఇదే మొదటిసారి. భారత వైద్య పరిశోధన మండలి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

ఈ రెండు రకాల గబ్బిలాలను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్, రౌసెటస్ గా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ రెండు జాతులకు చెందిన 25 గబ్బిలాల నమూనాల్లో కరోనా వైరస్ కనిపించింది.

ఈ వైరస్ నివారణకు ఉపయోగించేేే ‘రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ చైన్ రియాక్షన్’ పరీక్షలు నిర్వహించినప్పడు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయని అధికారులు చెబుతున్నారు.

అయితే.. వీటి నుంచి మనుషులకు పాకుతుందా లేదా అన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదన్నారు. 2018, 2019 సంవత్సరాల్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఓడిశా, చండీగఢ్, పుదుచ్చేరిల్లోని అడవుల్లో గబ్బిలాలలపై ఈ పరిశోధనలు నిర్వహించారు.

ఐతే కేరళలోని రౌసెటస్ గబ్బిలాల నుంచి సేకరించిన నాలుగు నమూనాల్లోను పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు లోని ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాల్లోనూ ఈ వైరస్ కనపడింది. అయితే.. తెలంగాణ ఇతర రాష్ట్రాల గబ్బిలాల్లో వైరస్ కనపడకపోవడం గమనార్హం.
click me!