ఐఐటీ విద్యార్థినిపై ఐఏఎస్ ఆఫీసర్ లైంగిక వేధింపులు.. అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Jul 6, 2022, 7:24 AM IST
Highlights

ఓ ఐఏఎస్ ఆఫీసర్ నీచానికి దిగజారాడు.. రాష్ట్రం కాని రాష్ట్రానికి ప్రాజెక్టు నిమిత్తం వచ్చిన విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి అరెస్ట్ అయ్యాడు. 

రాంచీ :  విద్యార్థినిపై Sexual harassment కేసులో జార్ఖండ్‌లో ఓ ఐఎఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యాడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)కి చెందిన ఐఐటియన్ల బ్యాచ్‌లో 20 మంది Internsగా పనిచేస్తున్నారు. వారిలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 2019 బ్యాచ్ IAS officerని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

గత సంవత్సరం ఖుంటి సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO)గా నియమితుడైన సయ్యద్ రియాజ్ అహ్మద్ అనే సదరు ఆఫీసర్ ఈ వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని ఫిర్యాదు మేరకు జూలై 3న మహిళపై వేధింపులకు పాల్పడినందుకు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ బృందం ఇంటర్న్‌షిప్‌ కోసం జిల్లాకు వచ్చిందని ఖుంటి అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. వీరంతా లైవ్లీ హుడ్ జనరేషన్ ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. 

జూలై 2న, ఈ విద్యార్థులు SDO తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి పిలిచాడు. ఆ పార్టీ అర్థరాత్రి వరకు జరిగింది. ఆదివారం తెల్లవారుజామున, SDM, ఒంటరిగా ఉన్న ఒక విద్యార్థిని మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడినుంచి తప్పించుకుని కుంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్‌లు 354 (నమ్రత దౌర్జన్యం చేసే ఉద్దేశ్యంతో మహిళలపై దాడి చేయడం లేదా క్రిమినల్ ఫోర్స్ చేయడం), 354 ఎ (లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్ లేదా అభ్యర్థన), 509 (స్త్రీల గౌరవాన్ని కించపరిచేలా సంజ్ఞ లేదా చర్యలు చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు ఖుంటి ఎస్పీ అమన్ కుమార్ సోమవారం తెలిపారు. 

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ‌! దిగువ కోర్టులో ఆ విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశం!!

విద్యార్థిని ఫిర్యాదు మీద SDOను ఆ సాయంత్రమే అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే, అతను విద్యార్థిపై లైంగిక వేధింపుల ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆలస్యంగా SDOను అరెస్టు చేసినట్లు కుమార్ తెలిపారు. అహ్మద్‌ను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

“సంఘటన తర్వాత, కళాశాల తన విద్యార్థులందరినీ వెనక్కి తిరిగి రావాలని కోరింది. వీరు త్వరలోనే కుంటి నుంచి స్వస్థలానికి వెళ్లనున్నారు. జిల్లాలో చక్కగా జరుగుతున్న ప్రయోగానికి ఇది దారుణమైన ముగింపు అని ఖుంటి డిప్యూటీ కమిషనర్ శశిరంజన్ అన్నారు. ఈ సంఘటన తర్వాత, జిల్లా యంత్రాంగం కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు, SDO  జ్యుడిషియల్ కస్టడీ గురించి తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి లేఖలు పంపింది.. ఈ దారుణానికి పాల్పడిన ఆఫీసర్ అహ్మద్ మహారాష్ట్రలోని నాసిక్ నివాసి.

click me!