నగ్నంగా యువతి, తాను నగ్నంగా మారి... చివరకు కల కల్లలై...

By telugu teamFirst Published Apr 7, 2021, 7:48 PM IST
Highlights

ఐఎఎస్ కావాల్సిన యువకుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అర్థాంతరంగా తనువు చాలించాడు. యువతి నగ్నంగా కనిపించి, ఆమె కోరిక మేరకు అతను నగ్నంగా మారి మాట్లాడాడు. అదే అతన్ని బలి తీసుకుంది.

బెంగళూరు: ఎంబీఏ పూర్తి చేసి ఐఎఎస్ కలను సాకారం చేసుకుందామని ప్రయత్నిస్తున్న ఓ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఫేస్ బుక్ అతని ప్రాణాలను బలి తీసుకుంది. ఓ యువతి పేరుతో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ అతన్ని బలి తీసుకుంది. యువతి మాయలో పడి నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడాడు. దాన్ని సైబర్ నేరగాళ్లు రికార్డు చేసి అతన్ని బెదిరించడం ప్రారంభించారు. అప్పటికే అతను చాలా డబ్బులు వాళ్లకు సమర్పించుకున్నాడు. 

అయినా వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు భట్టరహళ్లి సమీపంలోనని కేఆర్ పురంలో నివాసం ఉంటున్నాడు. ఎంబీే పూర్తి చేసి ఐఎఎస్ కు ప్రిపేర్ అవుతున్నాడు. కాగా, రెండు వారాల క్రితం అతను ఇంట్లో ఉరివేసుకుని మరణించాడు. ఇంట్లో ఏ విధమైన సూసైడ్ నోటు కూడా లభించలేదు. 

అయితే, బాధితుడి ఫేస్ బుక్ ను అతని సోదరి పరిశీలించింది. దాంతో సైబర్ నేరగాళ్ల వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించింది. అయితే, తన అన్నను సైబర్ నేరగాళ్లు ఎందుకు బెదిరిస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. తన అన్న మరణించిన రెండు రోజుల తర్వాత నేహా శర్మ అనే ఖాతా నుంచి నీ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదురు చూస్తావంటూ ఓ మెసేజ్ వచ్చింది.

దాంతో ఆమె సైబర్ నేరగాళ్లకు తన బంధువు ఫోన్ నెంబర్ పంపించింది. ఆ తర్వాత తేజాస్ సురేష్ భాయ్ అనే వ్యక్తి నుంచి తన బంధువు నెంబర్ కు మెసేజ్ వచ్చింది. తేజాస్ తమకు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ వచ్చాడు. దాంతో మృతుడి సోదరి దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

కొద్ది రోజుల క్రితం బాధితుడికి నేహా శర్మ అనే వ్యక్తి ఖాతా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాడు. మెసేజ్ లు ప్రారంభమైన తర్వాత ఏర్పడిన పరిచయం నగ్నంగా వీడియో కాల్ చేసుకునే వరకు వెళ్లింది. 

ఓ రోజు యువతి బాధితుడికి కాల్ చేసి తన దుస్తులు తొలగించి నగ్నంగా కనిపించింది. ఆ తర్వాత అతడిని కూడా దుస్తులు విప్పేసి నగ్నంగా ఉంటే చూడాలని ఉందని చెప్పింది. దాంతో అనతు దుస్తులు విప్పేసి నగ్నంగా మారి మాట్లాడడం ప్రారంభించాడు. దాన్ని సైబర్ నేరగాళ్లు రికార్డు చేశారు. ఆ తర్వాత అతడికి ఫేస్ బు్క ద్వారా ఆ నగ్న వీడియోను పంపించారు. డబ్బులు ఇవ్వకపోతే వాటిని ఫ్రెండ్స్ కు పంపిస్తానని బెదిరించారు. దాంతో మృతుడు ఫ్రెండ్స్ వద్ద అప్పు చేసి 36 వేల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగలేదు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

click me!