డబ్బు వసూలు చేయడమే నీ జాబ్ అన్నారు: అనిల్ దేశ్‌ముఖ్‌పై సచిన్ వాజే ఆరోపణలు

Siva Kodati |  
Published : Apr 07, 2021, 06:45 PM IST
డబ్బు వసూలు చేయడమే నీ జాబ్ అన్నారు: అనిల్ దేశ్‌ముఖ్‌పై సచిన్ వాజే ఆరోపణలు

సారాంశం

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల వాహనం లభించిన కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోగా.. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాకు దారి తీసింది

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల వాహనం లభించిన కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోగా.. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాకు దారి తీసింది.

కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజే సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ఐఏ కస్టడీలో వున్న సచిన్ వాజే విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనను రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు సచిన్ వాజే చెప్పినట్లు తెలిసింది. బార్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేయమని చెప్పినట్లు సచిన్ వాజే ఆరోపించారు.

డబ్బులు వసూలు చేయడమే నీ ఉద్యోగమని అనిల్ దేశ్‌ముఖ్ అన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ కేసు.. సచిన్ వాజే చేసిన తాజా ఆరోపణలతో మరింత కాకరేపుతోంది. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే అనిల్ రాజీనామా చేసిన  సంగతి తెలిసిందే

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్