భారత వింగ్ కమాండర్ అభినందన్ కు అరుదైన గౌరవం: వీర్ చక్ర అవార్డుకు సిఫారసు

By Nagaraju penumalaFirst Published Apr 20, 2019, 8:49 PM IST
Highlights

రెండు రోజులపాటు పాకిస్తాన్ లో యుద్ధఖైదీగా ఉన్నారు. అనంతరం పాకిస్తాన్ వర్థమాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఇకపోతే అభినందన్ వీర్ చక్ర అవార్డుకు సిఫారసు చెయ్యడంపై యావత్ భారతీయులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడంతోపాటు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్ కమాండర్ వర్థమాన్ అభినందన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. 

అభినందన్ పేరును భారత వాయుసేన వీర్ చక్ర అవార్డుకు ప్రతిపాదించింది. అభినందన్ వీర్ చక్ర అవార్డుకు అన్నివిధాల అర్హడంటూ కేంద్రానికి సిఫారసు చేసింది. అభినందన్ తోపాటు మరికొంతమంది పేర్లను కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 

పుల్వామా దాడి ఘటనకు ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 26న బాలాకోట్ లోని జైషే ఉగ్రవాద సంస్థ శిబిరాలపై దాడి చేసింది. దీంతో ఫిబ్రవరి 27న భారత్ పై పాక్ దాడికి ప్రయత్నించడంతో ఇరు దేశాల మధ్య వైమానిక దళం పోరు నెలకొంది. 

అదే సందర్భంలో భారత్ లో చొరబడుతున్న పాక్ ఎఫ్-16 విమానాన్ని భారత వింగ్ కమాండర్ వర్థమాన్ అభినందన్ కూల్చివేశారు. అనంతరం అభినందన్ ప్రయాణిస్తున్న మిగ్ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కుప్పకూలిపోయింది. దీంతో ఆయన పాక్ సైనికులకు దొరికిపోయారు. 

రెండు రోజులపాటు పాకిస్తాన్ లో యుద్ధఖైదీగా ఉన్నారు. అనంతరం పాకిస్తాన్ వర్థమాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఇకపోతే అభినందన్ వీర్ చక్ర అవార్డుకు సిఫారసు చెయ్యడంపై యావత్ భారతీయులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

యుద్ధ సమయాలలో దైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే మూడో అత్యున్నత పురస్కారం వీర్ చక్ర అవార్డు కావడం విశేషం. పాకిస్తాన్ చెర నుంచి భారత్  కు వచ్చిన అనంతరం అభినందన్ విధుల్లో చేరినట్లు సమాచారం. 

అయితే అభినందన్ ను భద్రతా దృష్ట్యా శ్రీనగర్ లో కాకుండా పశ్చిమ ప్రాంతంలోని ఇతర ముఖ్యమైన ఎయిర్ బేస్ లో పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే వర్థమాన్ అభఇనందన్ మళ్లీ యూనిఫాం వేసుకోనున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 
 

click me!