హనీట్రాప్‌లో చిక్కుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారి.. భార్య బ్యాంక్ ఖాతాలో అనుమానస్పద లావాదేవీలు..

Published : May 12, 2022, 12:06 PM IST
హనీట్రాప్‌లో చిక్కుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారి.. భార్య బ్యాంక్ ఖాతాలో అనుమానస్పద లావాదేవీలు..

సారాంశం

హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హనీట్రాప్‌ వెనక వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. 

హనీట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై భారత వైమానిక దళానికి చెందిన దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హనీట్రాప్‌ వెనక వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో నిందితుడి భార్యకు చెందిన బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో మిలటరీ ఇంటెలిజెన్స్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అనంతరం దేవేంద్ర శర్మను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇక, నిందితుడు దేవేంద్ర శర్మను వైమానిక దళం నుంచి తొలగించారు. త్వరలోనే ఈ విషయంపై వైమానిక దళం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాన్పూర్‌కు చెందిన దేవేంద్ర శర్మ.. భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఢిల్లీలోని రికార్డుల కార్యాలయంలో అతడు పోస్టింగ్ చేయబడ్డాడు. 

ఓ గుర్తుతెలియని మహిళ ఫేస్‌బుక్ ద్వారా దేవేంద్ర శర్మతో స్నేహం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫోన్ సెక్స్ ద్వారా దేవేంద్ర శర్మన్ హనీ ట్రాప్‌ చేశారు. అతని నుండి సున్నితమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు. రాడార్ స్థానాలతో పాటు సీనియర్ అధికారుల పేర్లు, వారి చిరునామాల గురించి వివరాలను కోరారు. మహిళ ఉపయోగించిన నెంబర్.. భారతీయ సర్వీస్ ప్రొవైడర్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ మహిళను ఆచూకీని కనుగోనడానికి ప్రయత్నిస్తున్నారు

ఇక, మే 6వ తేదీన ఢిల్లీలోని ధౌలా కువాన్ ప్రాంతంలో దేవేంద్ర శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు అతని నుంచి గూఢచార్యానికి సంబంధించి వివరాలు రాబట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేశారు. ఇక, అతడిని సర్వీసు నుంచి తొలగించినట్టుగా అధికారులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?