ఇరాన్ లో కరోనా విజృంభన... స్వదేశానికి 58మంది భారతీయులు

By telugu news teamFirst Published Mar 10, 2020, 12:04 PM IST
Highlights

మొదటి విడతలో భాగంగా 58 మంది భారతీయులను తీసుకువచ్చేందుకు వైమానిక దళ(ఐఏఎఫ్‌ సీ-17) విమానం టెహ్రాన్‌ నుంచి బయల్దేరిందని పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఈ విమానం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ కానుందని వెల్లడించారు. 

కరోనా వైరస్ ఇరాన్ లో విజృంభిస్తోంది. చైనా తర్వాత ఎక్కువగా ఈ వైరస్ ఇరాన్ లోనే ప్రభలించింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న 58 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. మంగళవారం వారందరినీ ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. కాగా.. విమానం ఘజియాబాద్ లో ల్యాండ్ అయ్యింది.

విమానం ఘజియాబాద్ లో ల్యాండ్ అయిన కొద్ది సేపటికే దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘మిషన్ కంప్లీటెడ్’ అంటూ ట్వీట్ చేశారు.

Also Read కరోనా భయం... గుడిలో దేవుడి విగ్రహాలకు మాస్క్ లు...

ఈ ట్వీట్ కన్నా ముందు జయశంకర్ మరో ట్వీట్ కూడా చేశారు. ఇరాన్‌లో ఉండిపోయిన భారత యాత్రికులను సురక్షితంగా దేశానికి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశామని విదేశాంగ శాఖా మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. మొదటి విడతలో భాగంగా 58 మంది భారతీయులను తీసుకువచ్చేందుకు వైమానిక దళ(ఐఏఎఫ్‌ సీ-17) విమానం టెహ్రాన్‌ నుంచి బయల్దేరిందని పేర్కొన్నారు. కొన్ని గంటల్లోనే ఈ విమానం ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ కానుందని వెల్లడించారు. 

అదే విధంగా ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరిస్తున్న ఎంబసీ అధికారులు, వైద్య సిబ్బందికి జైశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కఠిన పరిస్థితుల్లో తమకు చేదోడువాదోడుగా నిలుస్తున్నందుకు ఇరాన్‌ అధికారులను ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. భారతీయులు స్వదేశానికి చేరుకోగానే మిషన్ కంప్లీటెడ్ అంటూ మరో ట్వీట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. 

click me!