RajBhar on Akhilesh: అఖిలేష్ ను ఏసీ గది నుండి బయటకు లాగుతా: ఓం ప్రకాష్ రాజ్‌భర్

Published : May 25, 2022, 03:54 AM IST
RajBhar on Akhilesh: అఖిలేష్ ను ఏసీ గది నుండి బయటకు లాగుతా: ఓం ప్రకాష్ రాజ్‌భర్

సారాంశం

RajBhar on Akhilesh: ఎస్పీ అధినేత‌ అఖిలేశ్ యాద‌వ్‌ను ఏసీ రూమ్‌ల్లోంచి  బ‌య‌ట‌కు తీసుకొస్తాన‌ని ఆయ‌న మిత్ర‌ప‌క్షం సుహెల్‌దేవ్ భార‌తీయ స‌మాజ్‌పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్ర‌కాశ్ రాజ్‌భ‌ర్ పేర్కొన్నారు.  ఇటీవ‌ల యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ఎస్పీతో ఎస్బీఎస్పీ జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే  

RajBhar on Akhilesh: స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌ను ఏసీ రూమ్‌ల్లోంచి  బ‌య‌ట‌కు తీసుకొస్తాన‌ని ఆయ‌న మిత్ర‌ప‌క్షం సుహెల్‌దేవ్ భార‌తీయ స‌మాజ్‌పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్ర‌కాశ్ రాజ్‌భ‌ర్ పేర్కొన్నారు.  ఇటీవ‌ల యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ఎస్పీతో ఎస్బీఎస్పీ జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆదివారం జరిగిన త‌న పార్టీ సమావేశంలో ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీల మ‌ధ్య పొత్తును వ‌దులుకుంటున్నార‌నే వ్యాఖ్య‌ల‌పై కూడా స్పందించారు.
 
సమాజ్‌వాదీ పార్టీ అధినేతకు ‘ఏసీ గదుల అలవాటు’ ఉందని ఎద్దేవా చేశారు.  అయితే.. రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు తాను కుదుర్చుకున్న పొత్తును వదులుకునేది లేదని స్ప‌ష్టం చేశారు. ఇరుపార్టీలు విడిపోయే దశలో ఉన్న‌యనే ఊహాగానాలను ఖండించారు. "మార్తే దమ్ తక్ ( చివరి శ్వాస వరకు)" కూటమిలో ఉంటానని.. అయితే,  తాను100 శాతం దృఢంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.
కూటమి అలాగే కొన‌సాగుతోందనీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామ‌ని తేల్చి చెప్పారు.

అఖిలేష్ యాదవ్ విషయానికొస్తే.. అవసరమైతే  అతనిని AC గది నుండి బయటకు లాగుతానని, సమాజ్ వాదీ పార్టీ అధినేత ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని ఆయ‌న సొంత పార్టీ నేత‌లే కోరుకుంటున్నార‌న్నారు. అఖిలేష్ యాదవ్‌కి నాలుగైదు సార్లు చెప్పాననీ, మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లి రోటీ, కప్డా, మకాన్ , దవాయి గురించి ప్ర‌జ‌ల‌తో మాట్లాడాలని అఖిలేష్ కు చెప్పాన‌ని రాజ్‌భర్ అన్నారు.

సమాజ్‌వాదీ కార్యకర్తలు తన వద్దకు వచ్చి తమ అధినేత ఏసీ గదుల్లోనే ఉంటున్నారని ఫిర్యాదు చేశారని అన్నారు. తాను  చెప్పేది ఒక్కటేన‌నీ, BSP నాయకురాలు (మాయావతి), కాంగ్రెస్ నాయకులు తమ AC గదుల నుండి బయటకు వచ్చి డబ్బు చెల్లించలేదనీ, గదుల నుండి బయటకి అడుగు పెట్టకపోతే.. త‌రువాత బాధ‌ప‌డాల‌ని అన్నారు.  

 మార్చిలో.. UPలో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి తర్వాత.. రాజ్‌భర్ మళ్లీ తన మాజీ భాగస్వామి BJP వైపు మొగ్గు చూపుతారని ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షాతో ఆయన భేటీ కూడా సంచన‌లంగా మారింది.  సమావేశానికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కానీ,  రాజ్‌భర్ మాత్రం ఎలాంటి సమావేశం జరగలేదని ఖండించారు.

2017లో రాజ్‌భర్ BJP నేతృత్వంలోని NDA సంకీర్ణంలో భాగంగా రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేశారు. కానీ 2019లో లోక్‌సభ ఎన్నికలలో.. తనను బిజెపి, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విస్మరిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ ఆయన కూటమి నుండి వైదొలిగారు. ఎస్పీ అధినేత  తూర్పు యూపీలో ఇత‌ర బీసీ కులాల్లో ప‌ట్టున్న నాయ‌కుడు రాజ్‌భ‌ర్‌.

PREV
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu