మోడీ నాయకత్వంలో దేశం ముందుకుపోతుంది: జయప్రద

Published : Mar 26, 2019, 04:30 PM IST
మోడీ నాయకత్వంలో దేశం ముందుకుపోతుంది: జయప్రద

సారాంశం

మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని.... అందుకే తాను బీజేపీలో చేరినట్టు  సినీ నటి  జయప్రద ప్రకటించారు. 


న్యూఢిల్లీ: మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోందని.... అందుకే తాను బీజేపీలో చేరినట్టు  సినీ నటి  జయప్రద ప్రకటించారు. 

మంగళవారం నాడు ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా తాను క్రియాశీలక రాజకీయాల్లో లేనని ఆమె చెప్పారు. మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందన్నారు. 

తన పూర్తి జీవితం బీజేపీకి అంకితం చేయనున్నట్టు చెప్పారు. పేదలకు, రైతులకు మోడీ  అనేక మంచి పథకాలను తీసుకొచ్చారని ఆమె చెప్పారు. గతంలో తాను టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీలో పనిచేసినట్టు గుర్తు చేసుకొన్నారు. తొలిసారిగా ఓ జాతీయ పార్టీలో చేరినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. మోడీ స్పూర్తితో తాను బీజేపీలో పనిచేస్తానని జయప్రద చెప్పారు.

సంబంధిత వార్తలు

బీజేపీలో చేరిన జయప్రద


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. సంక్రాంతి వేళ ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే
Rs 500 Notes : నిజంగానే ఆర్బిఐ రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తుందా..? కేంద్రం క్లారిటీ