నేను గొడ్డు మాంసం తింటా.. ఇష్టం ఉంటే మీరూ తినండి... మాజీ సీఎం

Published : Dec 30, 2020, 11:13 AM IST
నేను గొడ్డు మాంసం తింటా.. ఇష్టం ఉంటే మీరూ తినండి... మాజీ సీఎం

సారాంశం

తాను గొడ్డుమాసం తింటానని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ దుమారం రేపుతున్నాయి. ‘అవును.. నేను గొడ్డు మాంసం తింటా. అసెంబ్లీలోనే ఈ విషయం చాలాసార్లు చెప్పా. ఇది నా ఆహారపు అలవాటు. అడగడానికి మీరెవరయ్యా’ అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఓ కాంగ్రెస్‌ కార్యకర్తపై మండిపడ్డ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. 

‘ఇష్టం ఉంటే మీరూ తినండి. లేదా వదిలేయండి. నేనేం బలవంతం చేయను. నా ఆహారం నా హక్కు. అడగడానికి మీరెవరు’ అంటూ సిద్దూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రీ-ట్వీట్‌ చేసింది. ‘కాంగ్రెస్‌ను రాష్ట్రంలో సర్వనాశనం చేసేందుకు మీరొక్కరు చాలు. ధన్యవాదాలు’ అంటూ బీజేపీ ట్యాగ్‌ పెట్టింది.

ఆదివారం హనుమద్‌వ్రతం కావడంతో మాసం తినడం సరైనదేనా అంటూ కాంగ్రెస్‌ కార్యకర్త ప్రశ్నించడంపై సిద్దూ పై విధంగా నిప్పులు చెరిగారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లౌకికధర్మమా? అని సిద్దూను ప్రశ్నించారు. 

‘ఆయన ఏ మాంసం తిన్నా మాకు అనవసరం. హనుమంతుడు ఈ రోజే పుట్టాడా? అంటూ హిందువుల భావాలను దెబ్బతీస్తే మాత్రం సహించేది లేదు’ అంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు.
 
PREV
click me!

Recommended Stories

Nepal flash flood Update: నేపాల్ వరదల్లో కొట్టుకుపోయిన కోట్లు విలువ చేసే సోలార్ ప్యానెళ్లు
Nepal flash flood: నేపాల్ వరద బాధితులకోసం రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు | Asianet News Telugu