జైలు నుంచి విడుదల.. చిన్నమ్మ చేసే మొదటి పని ఇదే..

By telugu news teamFirst Published Dec 30, 2020, 10:44 AM IST
Highlights

శశికళ తరఫు న్యాయవాది రాజాసెంతూర్‌పాండియన్‌ జైలు అధికారులకు రాసిన లేఖలో, బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో 2017 నుంచి ఇప్పటివరకు ముందుగానే విడుదలైన వారి పేర్లు ఉదాహరణలుగా చూపారు.

అక్రమ ఆస్తుల కేసులో దివంగత జయలలిత నెచ్చలి శశికళ గత నాలుగు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆమె వచ్చే నెల జనవరి 27న జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె ఇప్పటికే 129 రోజులు విచారణ సమయంలో జైలులో వుండడంతో ఆ కాలాన్ని శిక్ష కాలం నుంచి మినహాయించాలని ఆమె తరఫు న్యాయవాది జైలు అధికారులకు విన్నవించినా, వారి  నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. 

ఈ విషయమై శశికళ తరఫు న్యాయవాది రాజాసెంతూర్‌పాండియన్‌ జైలు అధికారులకు రాసిన లేఖలో, బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో 2017 నుంచి ఇప్పటివరకు ముందుగానే విడుదలైన వారి పేర్లు ఉదాహరణలుగా చూపారు.

వారిని విడుదల చేసినట్టే శశికళను ముందుగానే విడుదల చేయాలని లేఖలో కోరారు. ఆ లేఖపై జైలు అధికారుల నుంచి ఎలాంటి బదులు రాలేదు. ఈ నేపథ్యంలో, మళ్లీ న్యాయవాది రాజాసెంతూర్‌పాండియన్‌ జైలు అధికారులకు మరో లేఖ జైలు అధికారులు ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు పంపించామని సమాధానమిచ్చారు. 

ఈ విషయమై న్యాయవాది రాజాసెందూర్‌ పాండియన్‌ మాట్లాడుతూ, శశికళ జనవరి 27వ తేదీ జైలు నుంచి విడుదలవుతారని ఇప్పటికే జైలు అధికారులు తెలిపారని, కానీ, ఆమె ముందుగానే విడుదలయ్యేందుకు అవకాశముందని తాము భావించామని, త్వరలో వారి నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామన్నారు. జైలు నుంచి విడుదలయ్యే శశికళ తొలుత జయలలిత సమాధి వద్ద వెళ్లి శపథం చేసిన అనంతరమే ఇంటికి వెళ్లనున్నారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు

click me!