కదిలించిన ‘దిశ’ ఘటన... ఒంటరిగా 3,200కిలోమీటర్లు యువతి సాహసం

By telugu teamFirst Published Dec 3, 2019, 11:11 AM IST
Highlights

ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్‌ యువతి అంటోంది. 

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం దేశం మొత్తాన్ని కదిలించింది. ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం వెళ్లి వస్తుండగా.. ప్లాన్ ప్రకారం స్కూటీ పంచర్ చేసి... దానిని బాగుచేస్తామని ఆమెను నమ్మించి దారుణానికి ఒడిగట్టారు. స్కూటీ బాగుచేయించామని నమ్మించి దిశను పక్కకు తీసుకువెళ్లి... చేతులు కాళ్లు పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లారు. 

లారీలు అడ్డంపెట్టి.. బలవంతంగా మద్యం నోట్లోపోసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఊపిరాడనివ్వకుండా చేసి హత్య చేశారు. దూరంగా వేరే ప్రాంతానికి దిశ మృతదేహాన్ని తీసుకువెళ్లి.. డీజిల్ పోసి తగలపెట్టారు. కాగా.. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిందితులను ఉరితీయాలంటూ అందరూ గళం వినిపించారు.

Latest Videos

AlsoRead justice for disha: కృష్ణా నదిలో ‘దిశ’ అస్థికల నిమజ్జనం...

కాగా... ఈ ఉదంతంపై ఓ యువతి వినూత్నంగా స్పందించింది. ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్‌ యువతి అంటోంది. 

మహిళలకు ధైర్యాన్నిస్తూ రాజస్తాన్‌లోని బలోత్రా నుంచి కన్యాకుమారికి 3,200 కిలోమీటర్లు ఆమె ఒంటరిగా స్కూటర్‌ ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను కలవనున్నట్లు ఆమె చెప్పారు.

ఆదివారం జోధ్‌పూర్‌లో కేబినెట్‌ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తన మిషన్‌ గురించి తెలియజేశారు. తనను తాను సైనికురాలిగా భావిస్తున్నానని, ఒంటరిగా ప్రయాణించడానికి భయపడనని అన్నారు. తాను ఒంటరిగా వెళ్లడానికి నిర్ణయించుకున్నానని, మధ్యలో వెను​కడుగు వేయబోనని నీతూ చోప్రా స్పష్టం చేశారు. ‘దిశ’ హంతకులను వ్యతిరేకంగా పోరాడటమే తన మిషన్‌ లక్ష్యమన్నారు.

click me!