తెగతెంపులకు సిద్దమైన భార్య... పాటపాడి భార్యను కూల్ చేసిన భర్త (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 19, 2020, 10:08 AM IST
తెగతెంపులకు సిద్దమైన భార్య... పాటపాడి భార్యను కూల్ చేసిన భర్త (వీడియో)

సారాంశం

పాటపాడి భార్యను కూల్ చేసి కాపురాన్ని చక్కదిద్దుకున్నాడో భర్త. 

ఝూన్సీ: ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు.. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు చేసిన  ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఇక లాభంలేదు తన భార్య గురించి తనకే తెలుసు... భార్య కోపాన్ని పోగొడుతానంటూ ఆ భర్తే రంగంలోకి దిగాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?? పాట పాడాడు. ఇలా పాటపాడి భార్యను కూల్ చేసి కాపురాన్ని చక్కదిద్దుకున్నాడు. 

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. దాంతో భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. పెద్దలతో రాయబారం నడిపాడు భర్త...వినలేదు. ఇక అతడితో కలిసి బతికేది లేదంటూ తెగేసి చెప్పంది. 

వీడియో

"

పోలీస్ స్టేషన్ కి భార్యాభర్తలని పిలిచి  రాజీచేసే ప్రయత్నం చేశారు పోలీసులు.  భార్యతో రాజీకి భర్త  సిద్దంగా వుంటూ ఈ భర్త తనకొద్దంటూ భార్య తెగతెంపులకు సిద్దపడింది. దీంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించినా లాభం లేకపోయింది. 

ఎంతకు భార్య మాట వినకపోవడంతో ఆ భర్త పాట అందుకున్నాడు. భార్య ముందు నిల్చుని బద్లాపూర్ సినిమాలోని పాట అందుకున్నాడు. భర్త పాటకి అక్కడున్న వాళ్లందరూ షాక్ అవ్వగా భార్య మాత్రం తన్మయత్వంతో తన భుజంపై వాలిపోయి కన్నీటిపర్యంతమైంది.. వీరిద్దరి ప్రేమవిజయాన్ని వీడియోలో బంధించి ట్విటర్ లో షేర్ చేసాడు ఐపిఎస్ మధుర్ వర్మ.  ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?