
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య జననాంగానికి కుట్లు వేశాడు. ఆమెపై ఆనుమానంతో అతను ఆ పనిచేశాడు. తనను మోసం చేస్తుందని అతను భావించి ఆ దారుణ సంఘటనకు ఒడిగట్టాడు.
ఆ సంఘటన సింగ్రౌలీ జిల్లాలోని రైలా గ్రామంలో చోటు చేసుకుంది. తమకు మహిళ సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
అయితే, తన భర్త పట్ల ఆ మహిళ అత్యంత దయాగుణం ప్రదర్శించింది. తన భర్తపై కఠినమైన చర్యలు తీసుకోవడ్దని ఆమె పోలీసులను కోరింది. తన భర్తను పట్టుకుని కేవలం కొట్టాలని, తిరిగి అటువంటి పనిచేయకుండా కొట్టి వదిలేయాలని కోరింది.
ప్రస్తుతం ఆ మహిళ సింగ్రౌలీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.