సినిమా డైలాగ్ రీల్ చేసిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్ అవ్వడంతో..!

Published : Aug 28, 2021, 07:52 AM IST
సినిమా డైలాగ్ రీల్ చేసిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్ అవ్వడంతో..!

సారాంశం

ఆగ్రాలో తాను పనిచేస్తున్న పోలీస్‌ స్టేషనులో  ప్రియాంక మిశ్రా అనే కానిస్టేబుల్‌ ఓ హిందీ డైలాగ్‌కు లిప్‌ సింక్‌ చేస్తూ వీడియో చిత్రీకరించారు.

ఆమె ఒక మహిళా కానిస్టేబుల్. సరదా కోసం చేసిన ఓ ప్రయత్నం బెడసి కొట్టడంతో.. ఉన్నతాధికారులతో చివాట్లు తినాల్సి వచ్చింది.  ఆమె సినిమా రీల్ చేయడమే దానికి కారణం కావడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగ్రాలో తాను పనిచేస్తున్న పోలీస్‌ స్టేషనులో  ప్రియాంక మిశ్రా అనే కానిస్టేబుల్‌ ఓ హిందీ డైలాగ్‌కు లిప్‌ సింక్‌ చేస్తూ వీడియో చిత్రీకరించారు. ‘‘హర్యానా, పంజాబ్‌ అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకున్నాయి.. గానీ ఇక్కడికి రండి. ఇక్కడ ఐదేళ్ల పిల్లలకు కూడా తుపాకులు వాడటం తెలుసు’’ అంటూ వివాదంలో చిక్కుకున్నారు. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆమెను మందలించారు. ఆగ్రా పోలీస్‌ లైన్స్‌కు అటాచ్‌ చేశారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. ఈ విషయం గురించి ఆగ్రా ఎస్‌ఎస్‌పీ మునిరాజ్‌ ‘ది ప్రింట్‌’తో మాట్లాడుతూ... ‘‘ప్రవర్తనా నియమావళిని ఆమె ఉల్లంఘించారు. ఆ వీడియో మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నాం. పోలీస్‌ లైన్స్‌కు ఆమెను పంపించాం. ఘటనపై దర్యాప్తు చేపట్టాం. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word