కేరళ విషాదం: నిఫా వైరస్ తో మరణించిన నర్సు భర్త ఉదారత

By pratap reddyFirst Published Aug 17, 2018, 10:07 PM IST
Highlights

నిఫా వైరస్ సోకి మరణించిన నర్సు లినీ గుర్తుండే ఉంటుంది. కేరళలో నిఫా వైరస్ రోగికి చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు కూడా ఆ వైరస్ సోకింది. దాంతో ఆమె మరణించింది.

హైదరాబాద్: నిఫా వైరస్ సోకి మరణించిన నర్సు లినీ గుర్తుండే ఉంటుంది. కేరళలో నిఫా వైరస్ రోగికి చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు కూడా ఆ వైరస్ సోకింది. దాంతో ఆమె మరణించింది. ఆమె భర్త సజీస్ పుత్తుస్సేరికి ప్రభుత్వం క్లర్క్ ఉద్యోగం ఇచ్చింది. 

అయితే, ఆయన కేరళ వరద తాకిడి బాధితుల పట్ల తన ఉదారతను చాటుకున్నాడు. తన తొలి వేతనాన్ని వరద తాకిడి బాధితుల సహాయార్థం విరాళంగా ఇచ్చాడు. తన భార్య వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని అతను విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. అతనికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖలో క్లర్క్ ఉద్యోగం ఇచ్చింది. 

లినీ (31) మేలో మరణించింది. ఆమెకు ఏ మాత్రం జాప్యం చేయకుండా  అంత్యక్రియలు చేశారు. ఆమె ఇద్దరు పిల్లలు చివరి చూపునకు కూడా నోచుకోలేదు. తన ఇద్దరు పిల్లలను బాగా చూసుకోవాలని లినీ తన చివరి మాటలుగా భర్తకు రాసిన లేఖలో చెప్పింది. 

click me!