ఆస్తి కోసం కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా...

Published : Sep 11, 2019, 10:48 AM IST
ఆస్తి కోసం కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా...

సారాంశం

భాగ్యరాజ్ అదే ప్రాంతంలో టైలరింగ్ దుకాణం  నడుపుతున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో మరియలీల కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా... భాగ్యరాజ్ మాత్రం పిల్లలతో ఉంటున్నాడు. ఇటీవల.. భాగ్యరాజ్ అనారోగ్యానికి గురయ్యాడు.  

ఆస్తి కోసం కట్టుకున్న భర్తను ఓ భార్య అతికిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా వల్లియార్ సమీపంలోని కుల్లికుళం ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

కల్లికుళం ప్రాంతానికి చెందిన భాగ్యరాజ్(59), మరియలీల(55) దంపతులు. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. భాగ్యరాజ్ అదే ప్రాంతంలో టైలరింగ్ దుకాణం  నడుపుతున్నాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో మరియలీల కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా... భాగ్యరాజ్ మాత్రం పిల్లలతో ఉంటున్నాడు. ఇటీవల.. భాగ్యరాజ్ అనారోగ్యానికి గురయ్యాడు.

దీంతో అతను చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుందో అనే అనుమానం మరియలీల లోకలిగింది. ఈ క్రమంలో ఆస్తి తన పిల్లల పేరిట రాయాలని భాగ్యరాజ్ అనుకున్నారు. అయితే.. తనకు కూడా ఆస్తి రాయాలని మరియలీల కోరింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తీవ్రంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో భర్తపై పగ పెంచుకున్న మరియలీల... భర్తపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. 

అతడి కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే మంటలు ఆర్పించి...ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరియలీలను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !