దంపతుల మధ్య ఫోన్ చిచ్చు... భర్తను వదిలివెళ్లిన భార్య

Published : May 03, 2019, 11:08 AM IST
దంపతుల మధ్య ఫోన్ చిచ్చు... భర్తను వదిలివెళ్లిన భార్య

సారాంశం

దంపతుల మధ్య సెల్ ఫోన్ చిచ్చు పెట్టింది.  పొద్దస్తమానం ఫోన్ మాట్లాడుతుందని భర్త మందలించాడని... ఓ భార్య కట్టుకున్న మొగుడ్ని వదిలేసి వెళ్లిపోయింది. 

దంపతుల మధ్య సెల్ ఫోన్ చిచ్చు పెట్టింది.  పొద్దస్తమానం ఫోన్ మాట్లాడుతుందని భర్త మందలించాడని... ఓ భార్య కట్టుకున్న మొగుడ్ని వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం బాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు హోసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్ రాజ్ కి శిల్ప అనే యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ అనోన్యంగగా ఉండేవారు.  కాగా.. గత కొంతకాలగా భార్య శిల్ప(23) ఎక్కువ సమయం ఫోన్ లో గడుపుతోంది. ఈ విషయాన్ని గమనించిన ప్రేమ్ రాజ్..శిల్ప వేరొకరితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఉందని గొడవపడేవాడు. 

ఇదే విషయమై ప్రేమ్‌రాజ్‌ ఇటీవల నిలదీశాడు. దీంతో భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. శిల్ప ఏప్రిల్‌ 26వ తేదీ బంధువుల ఇంటికెళ్లి వస్తానని వెళ్లింది కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ప్రేమ్‌రాజ్‌ బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌