భార్య తన కళ్లముందే గడ్డివాములో మరో వ్యక్తితో సరసాలాడుతూ కనిపించింది. ఆ భర్త వెళ్లి గడ్డివాముకు నిప్పు పెట్టాడు. ఆ మంటల్లో భార్య సజీవం దహనమైంది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భర్తతో కలిసి ఉంటూనే మరో వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓ రోజు వారు గడ్డివాములో సరసాలు ఆడారు. ఇది ఆమె భర్త కంటపడింది. ఆయన ఆ గడ్డివాముకు నిప్పు పెట్టి వెళ్లిపోయారు. ఆమె సజీవ దహనం అయింది. కాలి బొగ్గయిపోయింది. ఈ ఘటన యూపీలోని బరేలీ జిల్లాలో గొటియా గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
గొటియా గ్రామంలో 35 ఏళ్ల నేపాల్ సింగ్, అంజలి దంపతులు. శనివారం రాత్రి ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నేపాల్ సింగ్ కూడా బయటికి వెళ్లాడు. ఆ రాత్రి పూట పంట పొలాల వద్ద ఓ గడ్డి వాముపై తన భార్య పరాయి పురుషుడితో సరసాలు ఆడుతూ కనిపించింది. నేపాల్ సింగ్ కోపం కట్టలు తెంచుకుంది. ఆ గడ్డి వాముగాకు నిప్పు పెట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అంజలి ఆ మంటల్లో కాలిపోయింది. అంజలి తల్లిదండ్రులకు నేపాల్ సింగ్ పై అనుమానాలు వచ్చాయి. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నేపాల్ సింగే తన బిడ్డను సజీవ దహనం చేశాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి నేపాల్ సింగ్‌ను అరెస్టు చేశారు.
పోలీసుల దర్యాప్తులో నేపాల్ సింగ్ తన నేరాన్ని అంగీకరించాడు. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నదని, అందుకే ఆమెను చంపేసినట్టు చెప్పాడు. అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. అంజలితో ఉన్న మరో వ్యక్తి పరిస్థితి గురించి ఏమీ తెలియరాలేదు.