
తన భార్య వేరే వ్యక్తితో తిరుగుతూ... తనను మోసం చేస్తుండడాన్ని ఓ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆమె వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, ప్రియుడుగా చెబుతున్న వ్యక్తి చేయి పట్టుకుని మాల్‌లో తిరుగుతుండడం కనిపిస్తుంది. ఆమెను ఫాలో అయిన భర్త తన స్మార్ట్‌ఫోన్‌లో ఆ వీడియోను రికార్డ్ చేశాడు.
ఓ షాపు దగ్గర ఇద్దరూ ఆగినప్పుడు వారిని నిలదీశాడు. ముందు భర్తను చూసి ఖంగుతిన్న భార్య.. ఆ తరువాత ఎదురుతిరిగింది. ఆ వ్యక్తి తన స్నేహితుడని చెప్పింది. కానీ, భర్త చేతులు పట్టుకున్న దాన్నంతా వీడియో తీశానని చెప్పడంతో భార్య దూకుడు పెంచింది. భర్తను కొట్టడం ప్రారంభించింది.
తన భార్య అతనితో ప్రేమాయణం సాగిస్తోందని, పెళ్లి చేసుకునేందుకు ఇళ్లు వదిలి పారిపోయారని వీడియోలోని భర్త సంభాషణబట్టి తెలుస్తుంది. భార్యాభర్తల వాగ్వాదం ముదిరి జనం గుమిగూడడంతో విడాకుల కోసం కోర్టుకు రమ్మని భర్త భార్యకు చెప్పడం కనిపించింది. భార్య కూడా తన ఇష్టం వచ్చినట్లు చేస్తానని చెప్పి విడాకులు కోరింది. వీరిద్దరు తమ బంధువులకు ఇష్టం లేకుండా.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం.
వీడియోలోని మాటలను బట్టి.. ఆ మహిళ తన కుటుంబాన్ని కొంతకాలంగా వేధిస్తున్నదని భర్త కూడా వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోలో భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో భర్త అబ్యూసింగ్ లాంగ్వేజ్ వాడడం వినిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినమని సలహా ఇస్తున్నాడు.
దీనిమీద నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘భర్త తిట్టడం దారుణంగా ఉందన్నారు’ కొంతమంది. ‘ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య అలా వేరే వ్యక్తితో తిరిగితే ఆ భర్త అలా రియాక్ట్ కాక ఏం చేస్తాడని..’ మరికొందరు అంటున్నారు. ‘భర్త వేరే స్త్రీతో పట్టుబడితో భార్యలు దాడులు చేస్తారు. ఇప్పుడీ భర్త చేసింది కూడా అదే కదా’ అని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.
అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో... ఆ వ్యక్తులెవరో తెలియరాలేదు.