
కర్ణాటక : గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షునితో పాటు మరో మహిళ murderకు గురయ్యారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకా చందాపురలోని రామయ్య లేఔట్ లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. హతులను నారాయణ స్వామి (42), కావ్య (32)గా గుర్తించారు. వీరిద్దరూ సమీపంలోని చిక్కహాగడె గ్రామానికి చెందినవారు.
భర్తకు విషయం తెలిసి..
నారాయణస్వామి కావ్య అనే married woman తో పరిచయం ఉంది. తరచుగా వారి ఇంటికి వెడతుండేవాడు. ఇది కావ్య భర్తకు నచ్చేది కాదు. ఆ రోజు కూడా నారాయణస్వామి కావ్య ఇంటికి వచ్చాడు. ఈ విషయం కావ్య భర్తకు తెలిసింది. అప్పటికే కావ్యను అనేక సార్లు హెచ్చరించిన భర్త.. ఇది విని కోపానికి వచ్చాడు.
తీవ్ర ఆవేశానికి లోనై...తన స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. అక్కడ ఇంటిముందు ఉన్న నారాయణ స్వామిని, ఇంట్లో ఉన్న కావ్యను knifeతో నరికి చంపాడు. ఆ తరువాత పరార్యాడు. అయితే అతనితోపాటు వచ్చిన స్నేహితులు కూడా ఈ హత్యల్లో అతనికి సహకరించారు. మరో ముగ్గురు కూడా ఈ హత్యాకాండలో పాల్గొన్నట్టు సూర్యనగర పోలీసులు తెలిపారు.
ఇది గమనించిన కావ్య తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వారు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిశీలించారు. హత్యకు కారణం పాత కక్షలా? లేక ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా? నారాయణ స్వామి కావ్య ఇంటికి ఎందుకు వచ్చాడు? అసలు కారణం ఏంటీ? అనే విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న భర్త, ఇతరుల కోసం గాలిస్తున్నారు.
ముంబయిలో దారుణమైన ఘటన జరిగింది. డిసెంబర్ 11, శనివారంనాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన Music systemలో ఎక్కువ Sound పెడుతున్నాడని.. అతని పక్కింటి వ్యక్తి దాడిచేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 25 యేళ్ల నిందితుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించడానికి నిరాకరించడంతో.. గొడవ జరిగింది. చివరకు అదిConflictగా మారి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది.
అమ్మాయి పేరుతో ఇన్ స్టా అకౌంట్.. ఫొటోలు మార్ఫింగ్ చేసి.. నగ్నవీడియోకాల్స్ చేయాలంటూ బ్లాక్ మెయిల్...
మరణించిన వ్యక్తిని సురేందర్ గౌడ్ (47)గా గుర్తించారు. బుధవారం ముంబై మలాడ్ లోని.. మాల్వానీ కాలనీ ఏక్తా చాల్ సొసైటీ లో జరిగిన ఈ దారుణమైన murder వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు, నిందితుడు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని సైఫ్ అలీ షేక్ (25) గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరణించిన వ్యక్తి తన ఇంటి వెలుపల తన Tape recordలో పాటలు వింటున్నాడు. నిందితుడు అతనిని వాల్యూమ్ తగ్గించమని అడిగాడు. దీనికి అతను ఒప్పుకోలేదు. దీనిపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణలో బాధితుడు తలకు గాయాలై మరణించాడు. అయితే నిందితుడికి బాధితుడిని చంపాలనే ఉద్దేశ్యం లేదని.. క్షణికావేశంలో హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.
బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలు మోపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి.. న్యాయమూర్తి ఆదేశాల అనంతరం కస్టడీకి తరలించారు.
ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో ఓ దారుణ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ చిన్నారి పాలిట యమదూతలుగా మారారు. ఆడపిల్ల అనే అసహనం కన్నకడుపు తీపిని చంపేసింది. కర్కశంగా ప్రవర్తించేలా చేసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే అత్యంత దారుణంగా చంపేసింది.
ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన కారణంగా పసికందుకు పాశవికంగా హతమార్చింది. బిడ్డను murder చేసిన తర్వాత health బాగా లేదంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై Medical staff పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడానికి ముందే రాత్రికి రాత్రే పాప Dead bodyని తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వెలికితీసి Postmortem చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తెను చంపేసిన దంపతులకు గతంలోనే ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.