
కోయంబత్తూరు : ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు పెచ్చుమీరిపోతున్నారు. రకరకాల రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బులు కాజేసేవాళ్లు కొంతమంది అయితే, మహిళల పేరుతో పరిచయం పెంచుకుని... ఫొటోలు మార్ఫింగ్ చేసి.. అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ న్యూడ్ కాల్స్ తో తమ ఉచ్చులోకి లాగేవాళ్లు మరికొందరు. అలాంటి ఘటనే కోయంబత్తూరులో జరిగింది. ఓ అమ్మాయి ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తిరుపూర్‌లోని ఓ కాలేజీ విద్యార్థినిని morphing చేసిన ఫోటోతో బెదిరించి, తనకు nude video calls చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తున్న 23 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపూర్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని కోయంబత్తూరు నగరంలోని కునియాముత్తూరు సమీపంలోని మెట్టుకాడు నివాసి ఎన్ నియాజ్‌గా గుర్తించారు. నియాజ్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు.
నియాజ్ అమ్మాయిల పేరుతో రెండు Instagram accountలను తెరిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. “అతను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓ కాలేజీ అమ్మాయితో స్నేహం చేశాడు, ఆమె ఫోటోలను Download చేశాడు. ఆమెతో ఏర్పడిన పరిచయంతో గత కొన్ని నెలలుగా ఆమెతో చాట్ చేశాడు. అయితే, ఈ మోసం తెలియని ఆ అమ్మాయి తాను వేరే అమ్మాయితోనే చాట్ చేస్తున్నానని నమ్మింది. దీంతో అతనికి తన Photoలను కూడా షేర్ చేసింది.
తను అనుకున్నది సాధించాననుకున్న నియాజ్, ఆమె పంపిన ఫోటోలను మార్ఫింగ్ చేశాడు. తరువాత ఆ ఫొటోలను ఆమెకు పంపించాడు. అశ్లీల చిత్రాలను తాను Social mediaలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే.. తనకు నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని బెదిరించాడు.
బాలిక సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఐ సోర్నవల్లికి ఫిర్యాదు చేసింది. అతను నియాజ్‌పై సెక్షన్‌లు 354A (లైంగిక వేధింపులకు, లైంగిక వేధింపులకు శిక్ష), 354B (బట్టలు విప్పాలంటూ దురుద్దేశ్యంతో మహిళపై దాడి చేయడం లేదా నేరపూరిత శక్తిని ఉపయోగించడం) 354D (వెంబడించడం)ల కింద కేసు నమోదు చేశారు.
భారత శిక్షాస్మృతి, సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్లు 66D (కంప్యూటర్ వనరులను ఉపయోగించడం ద్వారా వ్యక్తిత్వం ద్వారా మోసం చేసినందుకు శిక్ష), 67A (లైంగిక అసభ్యకరమైన చర్య మొదలైన వాటిని ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం లేదా ప్రసారం చేయడం కోసం శిక్ష), డిసెంబర్ 2న తమిళనాడు మహిళా వేధింపుల నిషేధ చట్టం, 1998లోని సెక్షన్ 4 (మహిళపై వేధింపులకు జరిమానా)లతో నియాజ్‌ను శుక్రవారం (డిసెంబర్ 10) అరెస్టు చేశారు.
“అతని మొబైల్ ఫోన్‌లో కొంతమంది యువతులతో చేసిన నగ్న వీడియో కాల్‌ల రికార్డింగ్‌లను మేము కనుగొన్నాము. నియాజ్‌పై ఫిర్యాదు చేసేందుకు బాధితులందరూ ముందుకు రావాలని కోరుతున్నాం’’ అని సోర్నవల్లి తెలిపారు. నియాజ్‌ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద తిరుపూర్ జిల్లా జైలులో ఉంచారు.