భార్య గర్భం దాల్చడం లేదని దారుణంగా హత్య చేసిన భర్త.. !

Published : May 29, 2023, 10:23 AM IST
భార్య గర్భం దాల్చడం లేదని దారుణంగా హత్య చేసిన భర్త.. !

సారాంశం

భార్య గర్భం దాల్చకపోవడంతో విసుగుచెందిన ఓ భర్త.. ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. 

థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో భార్య గర్భం దాల్చడం లేదని అతి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ విషయం మీద తరచూ గొడవలు పడే ఓ వ్యక్తి తన 35 ఏళ్ల భార్యను హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

అంబర్‌నాథ్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో ఈ దంపతుల నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగడంతో 37 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉల్హాస్‌నగర్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు.ఆ వ్యక్తి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

మహిళ గర్భం దాల్చకపోవడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని అధికారి తెలిపారు. ఆదివారం మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరగడంతో నిందితుడు భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో మహిళ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

సెంగోల్ మొదటి రోజే వంగిపోయింది - ఎంకే స్టాలిన్.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన తమిళనాడు సీఎం

విషయం తెలియడంతో ఫ్యాక్టరీలోని వర్కర్స్ యూనియన్ ప్రతినిధి పోలీసులను అప్రమత్తం చేశారు, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ జెబి సోనావానే పిటిఐకి తెలిపారు. ఆ వ్యక్తిని ఆదివారం రాత్రి అరెస్టు చేసి అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu