ఎయిర్ టెల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

First Published 4, Jun 2018, 1:30 PM IST
Highlights

తక్కువ ధరకి .. ఎక్కువగా డేటా ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ .. మరోసారి కష్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు తీసుకురావడం, డేటా ఎక్కువగా అందించడం లాంటివి చేస్తూనే ఉంది.  తాజాగా తాజాగా తన 399 రూపాయల ప్లాన్‌ను సమీక్షించింది. 

ఈ సమీక్షలో రోజువారీ అందించే డేటా పరిమితిని ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు పెంచింది. అంతకముందుకు ఈ డేటా ప్లాన్‌పై రోజుకు 1.4జీబీ డేటా మాత్రమే ఆఫర్‌ చేయగా.. తాజాగా రోజుకు 2.4జీబీ డేటా ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. 

దీంతో రిలయన్స్‌ జియోకు గట్టి పోటీగా నిలవవచ్చని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. అదే ధరలో రిలయన్స్‌ జియో తన ప్యాక్‌పై రోజుకు 1.5జీబీ డేటాను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. ఈ డేటా పెంపుతో 1 జీబీ డేటా, వినియోగదారులకు రూ.1.97కే లభ్యమవుతోంది.

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ఈ 399 రూపాయల ప్యాక్‌ వాలిడిటీ 70 రోజులు. అయితే ఎంపిక చేసిన యూజర్లకు ప్యాక్‌ వాలిడిటీని కూడా 84 రోజులకు పెంచింది. అంతేకాక రోజుకు 2.4జీబీ డేటా ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్యాక్‌పై డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తోంది. 

కొంతమంది యూజర్లకు ఈ ప్యాక్‌ వాలిడిటీని, డేటా పరిమితిని పెంచినట్టు టెలికాం టాక్‌ రిపోర్టు కూడా పేర్కొంది. ఈ లెక్కన 1 జీబీ, ఒక్క రూపాయి 97 పైసలకే లభ్యమవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే అత్యంత తక్కువ ధర. కేవలం పరిమిత సంఖ్యలో కస్టమర్లకు మాత్రమే కాక, ఓపెన్‌ ఆఫర్‌గా త్వరలోనే మార్కెట్‌లోని కస్టమర్లందరికీ ప్రవేశపెట్టనున్నట్టు ఎయిర్‌టెల్‌ చెప్పింది.

Last Updated 4, Jun 2018, 1:30 PM IST