ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ కు సంఘీభావం: 700 మంది ప్రముఖుల మద్దతు

Published : Aug 16, 2023, 05:41 PM ISTUpdated : Aug 16, 2023, 05:42 PM IST
ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ కు సంఘీభావం: 700 మంది ప్రముఖుల మద్దతు

సారాంశం

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ కు పలువురు  సంఘీభావం ప్రకటించారు.  ఈ మేరకు  700  మంది ప్రముఖులు  పత్రికా ప్రకటన విడుదల చేశారు.


న్యూఢిల్లీ:ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ కు పలువురు ప్రముఖులు సంఘీభావం తెలిపారు.ఈ మేరకు  తమ సంతకాలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు.  700 మంది ప్రముఖులు  ఈ ప్రకటనపై సంతకం చేశారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు, ప్రజా ఉద్యమంలో పనిచేసిన నేతలు,  న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, రచయితలు, కళాకారులు, చిత్ర నిర్మాతలు, నటులు సంతకాలు చేశారు.

జాన్ దయా, ఎన్. రామ్,  ప్రేమ్ శంకర్ ఝా, సిద్దార్ధ్ వరదరాజన్, ఎంకె. వేణు( ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు), సుధీంద్ర కులకర్ణి, పి.సాయినాథ్, వైష్ణరాయ్ (ఫ్రంట్ లైన్, ఎడిటర్), బెజవాడ విల్సన్, (నేషనల్  కన్వీనర్, సఫాయి కర్మచారీ) తదితరులు  సంతకాలు చేశారు.  న్యూస్ క్లిక్ ఆన్ లైన్  పోర్టల్ చైనా నిధులతో నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 

 ది న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురించిన కొన్ని కథనాల ఆధారంగా  ఆన్ లైన్ పోర్టల్  న్యూస్ క్లిక్ ,వ్యవస్ధాపకులు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థపై  తప్పుడు ఆరోపణలను  వీరంతా ఖండించారు. న్యూస్ క్లిక్ ఎలాంటి చట్టాలను  ఉల్లంఘించలేదని వారు  పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు,  దేశంలోని  కోట్లాది మంది ప్రజలు, వాటి ప్రభావంపై కథనాలను న్యూస్ క్లిక్ అందిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. సమాజంలో అత్యంత బాధలు , దోపీడికి గురౌతున్న వర్గాల గురించి ఈ సంస్థ కథనాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్మికులు, కర్షకుల  పోరాటాలను  ఈ పోర్టల్ వెలుగులోకి తెచ్చిందని  ప్రముఖులు  గుర్తు చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న అన్ని ప్రజా ఉద్యమాలకు  న్యూస్ క్లిక్  ప్రాముఖ్యతను ఇచ్చిన విషయాన్ని  వారు ప్రస్తావించారు. ప్రపంచం

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu