
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ramnath Kovind) ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కులం (Caste), లింగం (Gender), మతం (Religion) ఆధారంగా మానవజాతిని (Humanity) విభజించవద్దని అన్నారు. భారత సంస్కృతిలో అవసరార్థులకు సేవలు చేయడమే తొలి ప్రాధాన్యత అని వివరించారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన మత ఆచార, వ్యవహారాలు ఉన్నాయని తెలిపారు. కానీ, వాటన్నింటిలోనూ కామన్‌గా కనిపించేది.. మానవజాతి మొత్తాన్ని కుటుంబంగా భావించి వారికి సేవలు చేయడమేనని వివరించారు. ఒడిశాలో నిర్వహించిన గౌడియా మఠ్, మిషన్ వ్యవస్థాపకుడు శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపద్ 150వ జయంత్యుత్సవాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడారు.
ఇదే స్ఫూర్తి కరోనా కష్టకాలంలో హెల్త్ వర్కర్లు, నర్సులు, డాక్టర్లలో కనిపించిందని రాష్ట్రపతి అన్నారు. అనేక మంది వారి సహోద్యోగులు కరోనా బారిన పడుతున్నప్పటకీ వారు ప్రజలకు సేవ చేయడంలో వెనుకంజ వేయలేదని తెలిపారు. ఎంతో మంది కొవిడ్ వారియర్లు తమ జీవితాలను త్యాగం చేశారని వివరించారు. అయినప్పటికీ మిగతా వారూ వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజా సేవకు అంకితం అయ్యారని చెప్పారు. భక్తి భావంతో దైవాన్ని కొలవడం దేశవ్యాప్తంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న మతాలు, కులాలు, లింగ బేధం, సంప్రదాయాల్లో తారతమ్యం వంటివి దేశ సాంస్కృతిక వైవిద్యాన్ని బలోపేతం చేసేలా భక్తి మార్గం ఉన్నదని వివరించారు. భక్తి మార్గంలోని సన్యాసులు అందరూ ఒకరు మరొకరితో విభేదించబోరని తెలిపారు. అయితే, ఒకరి బోధనలను ఇంకోసారి స్ఫూర్తిగా తీసుకుంటారని పేర్కొన్నారు.
భక్తి మార్గాన్ని, సమానత్వాన్ని రామానుజాచార్యులు (ramanujacharyulu) నిర్దేశించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) అన్నారు. ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమంలో (chinna jeeyar swamy) ఆదివారం రామానుజ సహస్రాబ్దీ సమారోహం వేడుకల్లో (ramanuja sahasrabdi samaroham) ఆయన పాల్లోన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భక్తితో ముక్తి లభిస్తుందని వెయ్యేళ్ల క్రితమే రామానుజులు నిరూపించారని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.
అంతకు ముందు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్ సోమేశ్‌కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా రాష్ట్రపతి సమతామూర్తిని తిలకించారు. అనంతరం ఆశ్రమం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు చినజీయర్ స్వామి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సమతామూర్తి కేంద్రంలోని 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శించారు. ఆపై దివ్యక్షేత్రంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రవేదిలోని మొదటి అంతస్తులో కొలువై ఉన్న 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. రామ్‌నాథ్ కోవింద్ వెంట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.