
న్యూఢిల్లీ: చెక్ రిపబ్లిక్‌కు చెందిన 11 ఏళ్ల బాలికకు రపాంజల్ సిండ్రోమ్ ఉన్నది. ఈ సిండ్రోమ్ ఉన్నవారు వెంట్రుకలు తినే డిజార్డర్ ఉన్నది. అందుకే ఆమె వెంట్రుకలు తినడం ప్రారంభించింది. దీంతో ఆమె కడుపు వెంట్రుకలతో నిండిపోయింది.
ఈ డిజార్డర్ అరుదుల్లోకెల్లా అరుదుగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తొలిసారిగా ఈ కేసు 1968లో రిపోర్ట్ అయిందని వివరించారు. ఈ డిజార్డర్‌తో ప్రపంచవ్యాప్తంగా కేవలం కొన్ని డజన్ల మంది మాత్రమే ఉంటారని అంచనా వేశారు. ఈ డిజార్డర్‌కు బ్రదర్స్ గ్రిమ్ రాసిన కథలోని ఓ బాలిక పాత్ర పేరును పెట్టారు. అదే పాత్ర పేరుతో 2010లో డిస్నీ ట్యాంగిల్డ్ సినిమా తీసిన సంగతి తెలిసిందే.
ఈ డిజార్డర్ ఉన్నవారు వెంట్రుకలు లాగేసుకుంటారని, వాటిని తినేస్తూ ఉంటారని తూర్పు చెక్ సిటీ ఒపావాలోని సిలేసియన్ హాస్పిటల్ హెడ్ సర్జన్ మాతుస్ పేటేజా తెలిపారు. ఈ సిండ్రోమ్ ఎక్కువగా బాలికల్లో ఉంటుందని, అది కూడా వారి బాల్యం నుంచి మెచ్యూరిటీ ఏజ్ వచ్చే వరకూ ఎక్కువగా కనిపిస్తుందని వివరించారు.
Also Read: సుమ, అనసూయ, శ్రీముఖి, రష్మి గౌతమ్.. ఈ స్టార్ యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? షాక్ అవ్వాల్సిందే!
తాజా కేసులో ఆ బాలిక పొట్టలో నుంచి పెద్ద మొత్తంలో వెంట్రుకలను తొలగించారని వైద్యులు తెలిపారు. 20 సెంటిమీటర్ల పొడవు, 8 సెంటిమీటర్ల వెడల్పుతో స్థూపం ఆకారంలో ఈ వెంట్రుకలు ఉండచుట్టుకుపోయి ఉన్నాయని వివరించారు. ఆ వెంట్రుకలను ఆమె నోటి ద్వారా బయటకు తీయాలని తొలుత వైద్యులు భావించారు. కానీ, వెంట్రుకల ఉండ చాలా పెద్దగా ఉండటంతో నోటి గుండా తొలగించలేకపోయారు. దీంతో వారు సర్జరీ చేయక తప్పలేదని అన్నారు. పెద్ద బీర్ మగ్ సైజులో ఆ వెంట్రుకలు ఉన్నాయని వివరించారు.
‘ఒక వేళ మేం వెంట్రుకలను తొలగించకుంటే.. ఆ బాలికకు పొట్టలో నొప్పి అధికమయ్యేది. ఆమె బరువు తగ్గేది. కొన్ని కేసుల్లో ఆ వెంట్రుకల ఆకారం పెరిగి పొట్ట గోడలను దెబ్బతీసే అవకాశం ఉన్నది. కొన్నిసార్లు ఆ గోడలను పగులగొట్టే సామర్థ్యానికీ వెళ్లిపోవచ్చు’ అని డాక్టర్ పేటేజా తెలిపారు.
ఆ వెంట్రులకను కడుపులో నుంచి సర్జరీ ద్వారా తొలగించిన ఆ బాలిక ఆరోగ్యం ఇప్పుడు స్థిమితంగా ఉన్నదని వివరించారు. అయితే, ఆమెను సైకియాట్రిక్ వద్దకు తీసుకెళ్లుతారని, సైకలాజికల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు.