కారును వెనుక నుంచి ఢీకొట్టి దానిపై ఎగిరిపడిన బైకర్ నింపాదిగా కదులుతూ.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

Published : Mar 07, 2023, 06:07 PM IST
కారును వెనుక నుంచి ఢీకొట్టి దానిపై ఎగిరిపడిన బైకర్ నింపాదిగా కదులుతూ.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

సారాంశం

ఓ బైకర్ ముందున్న కారును ఢీకొట్టి గాల్లోనే ఒక రౌండ్ పల్టీ కొట్టి ముందు అద్దాలపై ల్యాండ్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోపై నెటిజన్లు చాలా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.  

న్యూఢిల్లీ: జిబ్రా క్రాసింగ్ వద్ద ఓ కుంటి కుక్క రోడ్డు నడి మధ్యలోకి వచ్చింది. ఎదురుగా ఎరుపు రంగు కారు వస్తుండటాన్ని చూసి మళ్లీ వెనక్కి మళ్లింది. జిబ్రా క్రాసింగ్, ఆ కుక్కను చూసి కారు నెమ్మదించింది. బహుశా రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉన్నదేమో. కానీ, వెనుకాల అల్లంత దూరం నుంచి వస్తున్న బైకర్ మాత్రం తన స్పీడ్ తగ్గించుకోలేదు. యథాతథంగా పోనిచ్చాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది అన్నట్టుగా ఆ బైకర్ అదే వేగంతో వచ్చి కారును ఢీకొట్టాడు. అంతే.. ఆ ఆజానుబాహుడు కారు పైకి జంప్ కొట్టాడు. ఒక రౌండ్ గాల్లోనే తిరిగి ముందటి విండ్ షీల్డ్ పై కూర్చున్నట్టుగా కూలబడ్డాడు. ఆ విండ్ షీల్డ్ మొత్తంగా డ్యామేజీ అయింది. కానీ, అతను మాత్రం కుర్చీలో కూర్చున్నట్టుగా నింపాదిగా కనిపించాడు. మెల్లగా కదిలే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆ కారు నడుపుతున్న మహిళ డోర్ తీసి బయటకు వచ్చింది. ఇంత వరకు ఆ వీడియో ఉన్నది. 

ఈ వీడియో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియో కింద కామెంట్లు చాలా హిలేరియస్‌గా ఉన్నాయి. ఆ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలేమీ కాలేవని అర్థం అవుతున్నది. అదీగాక, ఆ బైకర్ వచ్చి ఢీకొట్టిన విధం, ఎగిరి కారుపైనే ఒక రౌండ్ తిరిగి రిలాక్స్‌డ్ పొజిషన్‌లో విండ్ షీల్డ్ పై కనిపించడం ఫన్నీగా ఉన్నది. ఆ దృశ్యాలను ఒక్కో యూజర్ ఒక్కోలా కామెంట్ చేశాడు. 

Also Read: మహిళతో హోటల్‌కు.. లిక్కర్ తాగుతూ వయాగ్రా టాబ్లెట్లు వేసుకున్నాడు.. ఉదయమే మరణం.. వైద్యులు ఏమంటున్నారంటే?

ఆ మోటార్ సైకిలిస్ట్ కంటే కుక్క సరిగ్గా రూల్స్ పాటించిందని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఆ బైకర్ కంటే ఆ కారుకే ఎక్కువ నష్టం జరిగి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు. ఇంకొకరు బహుశా అతను తన ఫోన్ చూసుకుంటూ నడుపుతున్నాడేమ అని వివరించారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?