
న్యూఢిల్లీ: కేరళ రాజధానిలోని తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాలికట్ నుంచి డామ్మమ్ వెళ్లాల్సిన ఫ్లైట్ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అనుమానంతో తిరువనంతపురానికి డైవర్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
తిరువనంతపురానికి డైవర్ట్ చేసిన ఫ్లైట్ మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులో సేఫ్‌గానే ల్యాండ్ అయింది. ఫ్లైట్‌లో 182 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.
కొన్ని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, కాలికట్ నుంచి డామ్మమ్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ 385 విమానం టేకాఫ్ సమయంలో దాని తోక రన్ వేను తాకింది. ఈ రోజు ఉదయం కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది.
Also Read: రూ. 30ల కోసం వ్యక్తి పై కత్తితో దాడి, హత్య.. ఇద్దరు సోదరులు అరెస్టు
దీంతో ఫ్లైట్ టేకాఫ్ అయింది. కానీ, టెయిల్ రన్ వే ను తాకడం వల్ల హైడ్రాలిక్ ఫెయిల్ అయినట్టు అనుమానించారు. పేలుడు సంభవించరాదని, ఒక వేళ సంభవించిన తీవ్రత తక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఫ్లైట్‌లోని ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు. ఆ తర్వాత తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆ ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది.
ఈ కారణంగా తిరువనంతపురం ఎయిర్‌పోర్టు మేనేజ్‌మెంట్ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.