చండీగఢ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్తినష్టం భారీగా జరిగింది. ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.
చండీగఢ్ : చండీగఢ్లోని ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం అయిన నెహ్రూ ఆసుపత్రిలో అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోగులందరూ ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో సోమవారం అర్ధరాత్రి 11.45 గం.ల ప్రాంతంలో.. ఆసుపత్రి కింది అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూం. యుపిఎస్ సిస్టం దగ్గర మొదట మంటలు చెలరేగాయి. ఆ మంటలతో ఏర్పడిన పొగలు వెంటనే పై అంతస్తులకు వ్యాపించాయి. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆ సమయంలో మొత్తం 424 మంది రోగులు ఆసుపత్రిలో ఉన్నారు. ఉన్నారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి రోగులందరిని సురక్షితంగా బయటికి తరలించారు. 424 మంది రోగుల్లో 80 మంది గర్భిణీలు, 56 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఇక మరో 17 మంది చిన్నారులు చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 34 మంది రోగులు ఉన్నారు.
ఆస్తి కోసం అన్నను హతమొందించి.. కన్న తల్లి, సోదరితో కలిసి హైడ్రామా..
ఆస్పత్రిలో మంటలు చెలరేగిన తర్వాత గంటసేపు అత్యంత వేగంగా ఈ తరలింపు జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం కరెంట్ షాట్ సర్క్యూట్ అయి ఉంటుందనుకుంటున్నారు. పొగతో రోగులు ఉక్కిరి బిక్కిరి అయి ఇబ్బందులు తలెత్తకుండా.. పొగ చుట్టుకుపోకుండా ఉండడం కోసం.. పై అంతస్తుల్లో ఉన్న కిటికీలు తెరవడం ద్వారా పొగ బయటకి వెళ్లేలా చేశారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగాయి. వీరు మంటలని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం మీద ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ విపిన్ కౌషల్ మాట్లాడారు. ‘ఈ ప్రమాదం వల్ల పెద్ద స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. కానీ, ఎవరికీ, ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ఆస్పత్రి విస్తరణలో భాగంగా కట్టిన మరో భవనంలోకి రోగులందర్నీ తరలించారు’ అని చెప్పుకొచ్చారు.