మధురై రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. (వీడియో)

Published : Aug 26, 2023, 07:53 AM ISTUpdated : Aug 26, 2023, 09:27 AM IST
మధురై రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. (వీడియో)

సారాంశం

మధురై రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలులో సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొమ్మిది మంది మృతి చెందారు. 

మధురై : మధురై రైల్వే స్టేషన్‌ కి ఒక కిలో మీటర్ దూరంలో ఉండగా.. ఓ ఐఆర్సీటీ స్పెషల్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో అగ్ని ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందారు. సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు తమవెంట తెచ్చుకున్న  సిలిండర్ మీద టీ పెట్టడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. రైలు కదులుతుండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.  
ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.  ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ఐఆర్టీసీ స్పెషల్ ట్రైన్ లో వెళ్లే ప్రయాణికులు పర్యాటక స్థలంలో వంటలు చేసుకోవడం కోసం తమ వెంట చిన్న  సిలిండర్లు తీసుకువెడుతుంటారు. అలా తీసుకువెడుతుండగానే ఈ ప్రమాదం జరిగింది. పర్యాటక రైలు కావడంతో అంతగా పట్టించుకోలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం