సహజీవనంలో శృంగారం... అత్యాచారామా? : సీజేఐ

By narsimha lodeFirst Published Mar 2, 2021, 8:52 AM IST
Highlights

ఓ జంట కలిసి బతికారు, వారిద్దరూ కలిసి శృంగారంలో పాల్గొంటే అత్యాచారం అంటారా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: ఓ జంట కలిసి బతికారు, వారిద్దరూ కలిసి శృంగారంలో పాల్గొంటే అత్యాచారం అంటారా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రశ్నించారు.

అత్యాచార ఆరోపణల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోమవారం నాడు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ కి చెందిన ఓ మహిళ తనను పెళ్లి చేసుకొంటున్నట్టుగా నమ్మించి సహజీవనం చేసి అత్యాచారం చేశాడని ఓ వ్యక్తిపై కేసు పెట్టింది.ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బాధితురాలు రెండేళ్లకు పైగా ఆరోపనలు ఎదుర్కొంటున్న వ్యక్తితో సహజీవనం చేశారు. అయితే ఆ మహిళ పెళ్లయ్యేవరకు శృంగారానికి ఒప్పుకోనని చెప్పింది. దీంతో మనాలిలోని ఓ ఆలయంలో నిందితుడు ఆమెను పెళ్లి చేసుకొన్నాడని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అయితే ఈ మాటలు నిజం కాదని బాధితుడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బాధితురాలి సమ్మతితోనే ఆమెతో సహజీవనం చేస్తున్నారని కోర్టు చెప్పింది.

ఆలయంలో పెళ్లి నిజమైందని తేలడంతోనే ఆమె శృంగారానికి ఒప్పుకొందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ విషయంలో ఆమెను నిందితుడు మోసం చేశాడని చెప్పారు.

ఈ సమయంలో సీజేఐ స్పందించారు. పెళ్లి విషయంలో మోసపూరిత హామీ ఇవ్వడం తప్పు. ఎవరూ అలా చేయకూడదన్నారు. కానీ, సహజీవనం చేసి శృంగారంలో పాల్గొనడాన్ని రేప్ అని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయమై గతంలోనే స్పష్టమైన తీర్పులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  బాధితురాలిని నిందితుడు శారీరకంగా హింసించాడన్నారు. రహస్య భాగాల్లో గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లిందన్నారు. ఆమె కాలు కూడ విరిగిందని చెప్పారు. 

అయితే గృహ హింస కింద కేసు పెట్టాలి, కానీ అత్యాచార కేసు ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. వివాహ బంధంతో కలిసి జీవిస్తున్న సమయంలో జరిగిన దాడిని కూడ అత్యాచారంగా పరిగణిస్తారా అని సీజేఐ ప్రశ్నించారు.

ఈ కేసులో నిందితుడిని నాలుగు వారాల పాటు అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలన్న నిందితుడి అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.


 

click me!