అగ్ని ప్రమాదం: ఐదంతస్తుల భవనం నుండి మరో భవనంపైకి ఇద్దరి జంప్

By narsimha lodeFirst Published Mar 2, 2021, 8:03 AM IST
Highlights

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో 24 గంటల వ్యవధిలో రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ ప్రమాదాలతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సూరత్:గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో 24 గంటల వ్యవధిలో రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ ప్రమాదాలతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం నాడు సూరత్ పట్టణంలోని ఐదంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ భవనంలో ఉన్న ఇద్దరు తమ ప్రాణాలను కాపాడుకొనేందుకు ఒక భవనం నుండి మరో భవనంపైకి దూకినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

ఐదంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో విద్యుత్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు అగ్ని ప్రమాదం సంబవించిందని అధికారులు గుర్తించారు. ఈ భవనం నుండి మంటలు, పొగలు వచ్చిన విషయాన్ని గుర్తించిన స్థానికులు  ఫైరింజన్ కు సమాచారం ఇచ్చారు.

ఫైరింజన్ వచ్చేలోపుగానే ఓ మహిళ, పురుషుడు భయంతో తమ ఇంటి కిటికీలో నుండి పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ పైకి దూకారు. కింది ఫ్లోర్ లో ప్రారంభమైన మంటలు పై అంతస్థు వరకు చేరాయి.అగ్ని ప్రమాదం వాటిల్లిన భవనం టెర్రస్ పైన 9 మందిని చేర్చి వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. 

ఆదివారం నాుడ రాత్రి పెండేసర పారిశ్రామిక వాడలోని టెక్స్ టైల్స్ మిల్లులో మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో మిల్లులో 12 మంది కార్మికులున్నారు. సకాలంలో ఫైరింజన్లు చేరుకొని కార్మికులను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఫైరింజన్ సిబ్బందికి గాయాలయ్యాయి.


 

click me!