మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్: 12 రాష్ట్రాల పోలీసుల ఆపరేషన్

By narsimha lodeFirst Published Aug 1, 2021, 2:14 PM IST
Highlights


ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కళా జాతేదీ, రివాల్వర్ రాణిలను 12 రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో అరెస్టయ్యారు. నకిలీ గుర్తింపు కార్డులతో వీరిద్దరూ తరచూ తమ స్థావరాలను మారుస్తున్నారని పోలీసులు చెప్పారు.

న్యూఢిల్లీ:దేశంలోని 12 రాష్ట్రాల్లో పోలీసుల ఆపరేషన్ కారణంగా  మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పోలీసులకు చిక్కారు.సందీప్ అలియాస్ కళాజతేదీ, అనురాధ అలియాస్ రివ్వాలర్ రాణిలను పోలీసులు అరెస్ట్ చేశారు.కాంట్రాక్ట్ హత్యలు, దోపీడీలు, భూకబ్జాల వంటి నేరాలకు పాల్పడినట్టుగా కళా జాతేదీపై కసులున్నాయని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఢిల్లీ, హర్యానాకు చెందిన పోలీసులు ఇప్పటికే రూ. 6 లక్షల రివార్డును జాతేదీపై ప్రకటించారు.  యూపీలోని సహరాన్‌పూర్‌లో జాతేదీని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

గత ఏడాది ఫిబ్రవరి నుండి  జాతేదీ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. అనురాధా చౌదరి అలియాస్ రివాల్వర్ రాణి స్వంత ప్రాంతం రాజస్థాన్., ఆమెపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు. ఆమెపై  రూ. 10 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. కిడ్నాప్‌, వసూళ్లు తదితర పలు కేసులు ఆమెపై నమోదైనట్టుగా పోలీసులు తెలిపారు.

జాతేదీ, అనురాధలు దేశంలోని పలు ప్రాంతాల్లో నకిలీ గుర్తింపు కార్డులతో నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. తరచుగా తమ స్థావరాలను మార్చుకొంటున్నారని చెప్పారు.లారెన్స్ బిష్ణోయ్, సుబే గుజ్జర్, కళారాణతో సహా జైలులో ఉన్న పలువురు గ్యాంగ్‌స్టర్‌లతో కూడ వీరిద్దరూ పనిచేశారని పోలీసులు వివరించారు. యూపీ, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడ వీరు నేరాలకు పాల్పడ్డారని చెప్పారు.


 

click me!