
న్యూఢిల్లీ: ఒక వైపు చమురు ధరలు భారీగా పెరిగి ప్రపంచమంతా గింజుకుంటూ ఉంటే.. మరో వైపు భారత్ మాత్రం శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం మన దేశం 85 శాతం చమురు అవసరాలను దిగుమతల ద్వారానే తీర్చుకుంటున్నది. సమీప భవిష్యత్‌లో ఈ దిగుమతును కనీసం పది శాతం మేరకైనా తగ్గించాలని భావిస్తున్నది.
లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నరేంద్ర మోడీ ఐవోసీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది. చమురు సరఫరాలు, నిల్వలు, అందుబాటు ధరల్లో ఉంచుకోవడంపై దృష్టి పెట్టింది. దేశీయంగా ఆయిల్, గ్యాస్ అన్వేషణను యాక్సిసిబుల్ చేయడం, ఆరోగ్యకరమైన పోటీ ఉంచడానికి కీలకమైన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వుడ్ మెకింజీ అనే గ్లోబల్ రీసెర్చ్, కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ ఓ రిపోర్టు వెలువరించింది. ఇందులో భారత సముద్ర జలాల్లో (డీప్ వాటర్) చమురు అన్వేషణకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని పేర్కొంది. వ్యాపారాన్ని సులభతరం చేయడం ఇందుకు ఒక కారణం అని వివరించింది.
ఎనర్జీ సెక్టార్‌లో మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టులలను ఈ కన్సల్టెన్సీ అందిస్తూ ఉంటుంది. 2023 జనవరి రిపోర్టును.. దిగ్గజ కంపెనీలు భారత డీప్ వాటర్‌లపై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి? అనే టైటిల్‌తో విడుదల చేసింది. ప్రస్తుతం మన దేశంలో సముద్ర జలాల్లో చమురు అన్వేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని బలమైన అభిప్రాయాలు ప్రధాని కార్యాలయం నుంచి రెగ్యులేటరీ ఆఫీసుల వరకూ ప్రతి చోటా ఉన్నాయని ఆ రిపోర్టు తెలిపింది.
Also Read: రిలయన్స్ చేతికి ప్రముఖ చైనా కంపెనీ.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందో తెలుసా..?
భారత్‌లోని విస్తారమైన ఎనర్జీ మార్కెట్ చాలా కంపెనీలను ఆకట్టుకుంటున్నది. కేవలం దాని విస్తారాన్ని మాత్రమే కాదు.. ఇక్కడ బొగ్గుకు బదులు గ్యాస్‌ను వినియోగించాలనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. గతంలో కంటే ఇప్పుడు అన్వేషణకు ఏరియా పరిమితిని మరింత పెంచడం, గతంలో అందుబాటులో లేని ఏరియాలపైనా పరిమితులు ఎత్తేయడం, రెగ్యులేటరీ సులభతరం చేయడం, గ్యాస్ ధరలు, మార్కెట్ స్వేచ్ఛ వంటివెన్నో కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆ రిపోర్టు వివరించింది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో ఆస్ట్రేలియా, చైనా, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మార్కెటింగ్, పరిశ్రమ పోటీ సానుకూలంగా ఉన్నదని తెలిపింది. ఎగ్జాన్ మొబైల్ (ExxonMobile), టోటల్(Total), చెవ్రాన్ (Chevron) వంటి దిగ్గజ సంస్థలు భారత ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)తో కలిసి డీప్ వాటర్ అవకాశాలను పరిశీలించాలని ఆసక్తి చూపుతున్నట్టు ఈ రిపోర్టు తెలిపింది.
సప్లై సైడ్‌తోపాటు గ్యాస్ వినియోగాన్ని పెంచాలనే కొన్ని ప్రధాన సంస్థలు నిర్ణయించుకోవడమూ ఇందుకు కారణంగా ఉన్నాయి. భారత్‌లో ఇప్పటికే 22 వేల కిలోమీటర్ల పొడవైన గ్యాస్ పైప్‌లైన్ ఉండగా.. మరో 13 వేల కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణంలో ఉన్నది.
ఈ రిపోర్టున కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పురి ట్వీట్ చేశారు. ప్రపంచం మోడీ నాయకత్వం వైపు ఆశతో చూస్తున్నదని కామెంట్ చేశారు.