బెంగళూరు ట్రాఫిక్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు..!

Published : May 29, 2023, 04:34 PM ISTUpdated : May 29, 2023, 04:35 PM IST
 బెంగళూరు ట్రాఫిక్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు..!

సారాంశం

ఆ ట్రాఫిక్ పూర్తి అయ్యేలోపు ఆయన అక్కడ భోజనం పూర్తి చేయడం గమనార్హం. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

ట్రాఫిక్ అనే మాట వినపడగానే బెంగళూరు నగరం పేరు వినపడుతుంది. అతి త్వరలో బెంగళూరు నగరం దేశంలో స్టార్టప్ హబ్ గా కాకుండా ట్రాఫిక్ జామ్ నగరంగా పేరు పొందేలా కనపడుతోంది. ఇప్పటి వరకు బెంగళూరు ట్రాఫిక్ గురించి చాలా వార్తలు వినే ఉంటారు. తాజాగా అలాంటివార్తే మరోటి వెలుగులోకి వచ్చింది

సాయి చంద్ బయ్యవరపు అనే వ్యక్తి  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో బస్సు డ్రైవర్ ముందు సీట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు. నిజానికి ఆ బస్సు ట్రాపిక్ లో నిలిచిపోయింది. ఆ ట్రాఫిక్ పూర్తి అయ్యేలోపు ఆయన అక్కడ భోజనం పూర్తి చేయడం గమనార్హం. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది.

 

ఈ వీడియోకి “బెంగళూరులో పీక్ ట్రాఫిక్ మూమెంట్,” క్యాప్షన్  జత చేశాడు. వీడియోలోని టెక్స్ట్ ప్రకారం, ఈ సంఘటన సిల్క్ బోర్డు జంక్షన్ ట్రాఫిక్ జామ్ వద్ద చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకి 1.4 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఇక కామెంట్ల వర్షం కురుస్తోంది. 

ఆ బస్సు డ్రైవర్ పట్ల చాలా మంది సానుభూతి వ్యక్తం చేయడం గమనార్హం. భయంకరమైన ట్రాఫిక్ లో అంతకు మించి ఇంకేమి చేస్తారులే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది విచారకరం... ట్రాఫిక్ కారణంగా డ్రైవర్‌కు ప్రశాంతంగా కూర్చుని తినడానికి కూడా సమయం లేదు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?