
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కు బాలీవుడ్ సినీ నటుడు షారూఖ్ ఖాన్ ఫోన్ చేశాడు. షారూఖ్ ఖాన్ చిత్రం పఠాన్ విషయమై గతంలోనే అనేక నిరసనలు చెలరేగాయి.ఈ విషయమై అసోం రాష్ట్రంలో ని ఓ థియేటర్ లో జరిగిన ఘటన గురించి షారూఖ్ ఖాన్ తనతో మాట్లాడినట్టుగా అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ట్విట్టర్ వేదికగా చెప్పారు.
పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా రైట్ వింగ్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. షారూఖ్ ఖాన్ ఎవరు,. ఫఠాన్ చిత్రం గురించి తనకు తెలియదని శర్మ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గౌహతిలో సినిమా ప్రదర్శించేందుకు సిద్దంగా ఉన్న ఓ థియేటర్ లో ఏర్పాట్లు చేసే సమయంలో రైట్ వింగ్ కార్యకర్తలు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే.
ఈ సినిమా గురించి నిరసనకారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని కూడా సీఎం హిమంత బిశ్వశర్మ హామీ ఇచ్చారు.ఈ నెల 25న పఠాన్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పడుకొనే కాషాయ రంగు బికినీ ధరించడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.ఈ విషయమై గతంలోనే మధ్యప్రదేశ్ హోం మంత్రి సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు గౌహతిలోని నారేంగిలో సినిమా ప్రదర్శించబడుతున్న థియేటర్ ను వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.