బిర్యానీలో లెగ్ ఫీస్ లేదని దంపతుల చేతివేళ్లు నరికిన దుండగులు

First Published Jun 14, 2018, 11:04 AM IST
Highlights

రక్షణ కల్పించాలంటూ బంద్ నిర్వహించిన వ్యాపారులు...

చికెన్ బిర్యానీలో లెగ్ ఫీస్ ఇవ్వలేదని హోటల్ యజమాని, అతడి భార్య పై కత్తులతో దాడి చేశారు కొందరు దుండగులు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేని లో  చోటుచేసుకుంది. 

ఈ ఘటనపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరునల్వేని సమీపంలోని సుద్దమల్లిలో జాకీర్ హుస్సెన్-భాను దంపుతులు ఓ హోటల్ నడుపుతున్నారు. ఇందులో రుచికరమైన చికెన్ బిర్యాని ప్రత్యేకంగా తయారుచేస్తారు. అందువల్ల మాంస ప్రియులతో పాటు మందె బాబులు కూడా తినడానికి ఈ హోటల్ కే వస్తారు.

ఇలా మంగళవారం సాయంత్రం ఫుల్లుగా మందు కొట్టి ఏడుగురు వ్యక్తులు వీరి హోటల్‌కు వచ్చి బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే వీరికి అందించిన బిర్యానీలో లెగ్ ఫీస్ లు లేవని గొడవకు దిగారు. కత్తులతో జాకీర్, భానులపై దాడికి  పాల్పడ్డారు. వారి చేతివేళ్లను నరికేశారు. ఈ దాడి గురించి తెలుసుకున్న ఇతర వ్యాపారులు అక్కడికి చేరుకోవడంతో దుండగులు అక్కడి నుండి పరారయ్యారు.

ఈ గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం దాడికి పాల్పడ్డ దుండగుల్లో శబరి, సుడల్ ముత్తు అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న మిగతా ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు.

ఇలా తరచూ రౌడీలు తమపై దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారంటూ వ్యాపారులు పోలీసులకు తెలియజేశారు. వారి నుండి తమకు రక్షణ కల్పించడాని శాశ్వత పరిష్కారం చూపాలంటూ స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాలు మానేసి బంద్ పాటించారు. దీంతో పోలీసులు ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వ్యాపారులు శాంతించారు.

 

click me!