Karnataka Hijab row: "ఇది భ‌యాన‌క చ‌ర్య‌".. హిజాబ్ వివాదంపై స్పందించిన నోబెల్ గ్రహీత మలాలా

Published : Feb 09, 2022, 07:19 AM ISTUpdated : Feb 09, 2022, 07:31 AM IST
Karnataka Hijab row: "ఇది భ‌యాన‌క చ‌ర్య‌".. హిజాబ్ వివాదంపై స్పందించిన నోబెల్ గ్రహీత మలాలా

సారాంశం

Karnataka Hijab row: క‌ర్ణాట‌క‌లో రోజురోజుకు ముదురుతున్న హిజాబ్ వివాదంపై నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ స్పందించారు. హిజాబ్ ధ‌రించిన విద్యార్థినీల‌కు విద్యాసంస్థ‌ల్లోకి అనుమ‌తించిక పోవ‌డంపై తీవ్రంగా అభ్యంతరం వ్య‌క్తం చేశారు. ఇదో భ‌య‌క‌న చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.  

Karnataka Hijab row: కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. హిజాబ్ ధ‌రించిన విద్యార్థుల‌ను విద్యాసంస్థ‌ల్లోకి అనుమ‌తి నిరాక‌రించ‌డంతో ఉద్రిక్తత ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ఈ వివాదం కర్ణాటక స‌ర్కార్ ను కుదిపేస్తోంది. రాష్ట్రంలోని ప‌లు న‌గ‌రాల్లో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు జరగడం వల్ల.. ఈ వివాదానికి రాజ‌కీయ రంగు పులుముకుంది. దీంతో  విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితులు త‌లెత్తాయి. మరోవైపు, దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది.

తాజా వివాదం పై .. నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ స్పందించారు.  కర్నాటకలో హిజాబ్ ధరించిన విద్యార్థుల‌ను  విద్యాసంస్థ‌ల్లోకి అనుమ‌తించ‌క‌పోవ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ముస్లీం విద్యార్థినీల‌ను హిజాబ్‌లతో విద్యాసంస్థ‌ల్లోకి వెళ్లనివ్వడం భయంకరమ‌ని అని ట్వీట్ చేశారు. హిజాబ్ ను వ్య‌తిరేకించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ చ‌ర్య‌ను భ‌య‌న‌క చ‌ర్య‌గా వ‌ర్ణించారు. భారత నాయకులు.. ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాల‌ని పేర్కొన్నారు. 
 
కర్నాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ బాలికల పియు కళాశాలలో గత నెలలో హిజాబ్ నిరసనలు ప్రారంభమయ్యాయి.  హిందు విద్యార్థినులు కాషాయం కండువాలు ధరించి.. హిజాబ్ వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. తరగతుల్లో హిజాబ్ నిషేధించారని ఆరోపించారు. ఈ నిర‌స‌న‌లు ఉడిపి,  చిక్కమగళూరులోని వ్యాపించాయి..  రైట్‌వింగ్ గ్రూపులు.. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి.

త్వరలో ఈ వివాదం కర్ణాటక సరిహద్దులు దాటి బీజేపీ పాలిత మధ్యప్రదేశ్,పుదుచ్చేరిలోకి కూడా వ్యాపించింది. ఈ వివాదానికి రాజ‌కీయ రంగు పులుముకోవ‌డంతో.. మ‌రింత తీవ్ర‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల్లో ఉద్రిక‌త్త వాతావ‌రణం నెల‌కొంది. దీంతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.

 మరోవైపు, హిజాబ్ ఆంక్షలను ప్రశ్నిస్తూ ఉడిపిలోని ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినీలు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. శాంతియుతంగా ఉండాలని ప్రజలు, విద్యార్థులకు సూచించింది. హిజాబ్ వివాదం కర్ణాటకవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విద్యార్థులను హెచ్చ‌రించారు. శాంతియుతంగా వ్యవహరించాలని, పోలీసులను ఉపయోగించే పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు. ఈ వ్యవహారం పార్లమెంట్​నూ తాకింది. కాంగ్రెస్, డీఎంకే, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, సీపీఎం, సీపీఐ, జేఎంఎం పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

 అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ . ముస్లీం మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను 'ఐయామ్ మలాలా' (నేను మలాలా) అన్న పేరుతో ఆమె పుస్తకం రాసింది. అనేక ఉద్య‌మాల‌కు త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంది. 2021 నవంబరు 9న  బర్మింగ్‌హామ్‌లో ఇస్లాం సంప్రదాయంలో అసర్ మలిక్ అనే వ్య‌క్తిని మలాలా యూసఫ్‌జాయి పెళ్లి చేసుకున్నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu