హనీ ట్రాప్...భార్యను యువకులకు ఎరగావేసి బ్లాక్ మెయిల్

By Arun Kumar PFirst Published Oct 29, 2020, 8:14 AM IST
Highlights

అమ్మాయిల పేర్లతో సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసి ధనవంతుల పిల్లలతో పరిచయం పెంచుకుని హనీ ట్రాప్ కు పాల్పడే ఓ ముఠా అరెస్టయ్యింది. 

బెంగళూరు: అమ్మాయిలతో ధనిక యువకులకు వలపు వలవేసి హనీ ట్రాప్ కు పాల్పడుతున్న ఓ ముఠాను కర్ణాటక పోలీసులు అరెస్ట్  చేశారు. మహాదేవపుర లోని ఓ ఖరీదయిన ఇంటిని అడ్డాగా చేసుకుని యువకులను బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు దోచేస్తోంది ఓ ముఠా. బాధితుల నుండి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే... మహాదేవపురకు చెందిన అంజలి, ఈశ్వరి, దీపక్, టైసన్, ప్రేమనాథ్, వినోద్, ప్రకాశ్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు అమ్మాయిల పేర్లతో సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసి ధనవంతుల పిల్లలతో పరిచయం పెంచుకుంటారు. ఇలా హనీ ట్రాప్ కు పాల్పడి ఇంటికి రప్పిస్తారు. తన భర్త ఇంట్లో లేడని చెప్పి ఓ అమ్మాయి సదరు యువకున్ని ఇంట్లోకి తీసుకువెళుతుంది. 

ఇక్కడే ఈ ముఠా అసలు డ్రామా మొదలవుతుంది. భర్త, కుటుంబసభ్యుల పేరుతో ముఠా సభ్యులు ఎంటరై వీడియో తీసి నానా హంగామా చేస్తారు. తమ ఇంటి అమ్మాయితో అక్రమసంబంధం పెట్టుకుంటావా అంటూ నాటకాలాడి చివరకు భారీగా డబ్బులు వసూలు చేసి వదిలిపెడతారు. అయితే డబ్బులివ్వడానికి వ్యతిరేకించి తిరగబడే వారిని వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేయడం లేదంటే ఆయుధాలతో బెదిరించి మరీ డబ్బులు లాగుతారు. 

ఇలాంటి ఘటనపై ఇటీవల ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండడంతో మహదేవపుర పోలీసులు రంగంలోకి దిగారు. రెక్కీ నిర్వహించి ఆ ఇంటిపై దాడిచేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.  


 

click me!