నిరాశ్రయ యువతికి ఫుడ్ ఆఫర్ చేసి... అత్యాచారం

By telugu teamFirst Published Sep 18, 2019, 1:23 PM IST
Highlights

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన పై  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. యువతి కొన్ని రోజులుగా సారాయ్‌ కాలే ఖాన్‌ బస్‌ స్టేషన్‌ వద్దనే ఉంటుందని తెలిసింది.

ఆమెకు నా అనే వాళ్లు ఎవరూ లేరు. కనీసం ఉండటానికి ఇళ్లు కూడా లేదు. పార్కుల్లో, బస్టాప్ లలో ఉంటూ... అడ్డుకొని జీవనం సాగిస్తోంది. కాగా.. ఆమెపై ఇద్దరి వ్యక్తుల కన్ను పడింది. ఆమెకు ఆహారం అందించారు. వాళ్ల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె వాళ్లు ఇచ్చిన ఆహారం తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో... ఎవరూ చూడని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన దేశ రాజధాని నడిబొడ్డున చోటు చేసుకోవడం గమనార్హం. 
ఢిల్లీలోని ఓ పార్కులో ఆదివారం సాయంత్రం ఒంటరిగా ఉన్న ఇరవై ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ యువతి అపమారక స్థితిలోకి వెళ్లింది.అనంతరం యువతి పరిస్థితిని గమనించిన పార్క్‌లోని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు. 

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన పై  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. యువతి కొన్ని రోజులుగా సారాయ్‌ కాలే ఖాన్‌ బస్‌ స్టేషన్‌ వద్దనే ఉంటుందని తెలిసింది.

 అంతేగాక యువతి వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తోందని తేలింది. ఈ కేసులో అనుమానితులైన ఇద్దరు వ్యక్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు యువతికి రాత్రి ఆహారాన్ని తీసుకువచ్చి అందించినట్లు, దానికి యువతి నిరాకరించడంతో అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి ఆమెపై ఆత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తతం బాధితురాలిని ఎయిమ్స్‌లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. 

click me!