పదేళ్లలో 25 సార్లు ఇతరులతో లేచిపోయింది... అయినా, ఆమే నా ట్రూ లవ్ అంటున్న భర్త

Published : Sep 10, 2021, 02:47 PM ISTUpdated : Sep 10, 2021, 02:50 PM IST
పదేళ్లలో 25 సార్లు ఇతరులతో లేచిపోయింది... అయినా, ఆమే నా ట్రూ లవ్ అంటున్న భర్త

సారాంశం

తమకు పెళ్లైన పదేళ్లలో తన భార్య 25 సార్లు ఇతర పురుషులతో కలిసి పారిపోయిందని అసోంకు చెందిన మఫీజుద్దీన్ చెప్పారు. కానీ, ఆమె ఎన్నిసార్లు వెళ్లినప్పటికీ రాగానే ఏమీ అడగకుండా అక్కున చేర్చుకుంటారని, ఆమెనే తన ట్రూ లవ్ అని వివరించి షాక్ ఇచ్చారు. తమకు ముగ్గురు పిల్లలున్నారని, వారి బాగోగులను ఆమెనే చూసుకోవాలి కదా..? అనవసరంగా కేసులు పెట్టి ఖర్చులపాలు కావాలనుకోవడం లేదన్నారు.  

గువహతి: ‘నీవు నిజంగా ప్రేమిస్తే ఆ సీతాకోక చిలుకను వదిలిపెట్టు.. ఏదోనాడు నీ కోసం కచ్చితంగా తిరిగొస్తుంది’ అనేది ఓ సినిమా డైలాగ్. దీనినే ఓ అసోంకు చెందిన వ్యక్తి కొంత మార్చి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నది. నిజమైన ప్రేమకు సరైన వివరణ ఉండదని, ఒకవేళ తన సహచరి ఇతరులతో తిరిగినా ఆమెపై ప్రేమ చెక్కుచెదరని రాసిపెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఔను.. ఆ వ్యక్తి భార్య పెళ్లైన పదేళ్లలో 25 సార్లు ఇతరులతో కలిసి లేచిపోయింది. అయినా, ఆమె తిరిగి వచ్చినప్పుడు ఎంతమాత్రం కోప్పడకుండా అక్కును చేర్చుకుంటున్నాడు. ఆమెనే తన ట్రూ లవ్ అని కితాబిచ్చుకుంటున్నారు. వారిరువురికి ముగ్గురు పిల్లలు. వారి వింత ప్రేమ కథ ఏమిటంటే..

మధ్య అసోం నాగావ్ జిల్లాకు చెందిన ధింగ్ లహకర్ గ్రామస్థులు ఆ దంపతులు. వారికి 2011లో పెళ్లి జరిగింది. భర్త మఫీజుద్దీన్ వృత్తిరీత్యా డ్రైవర్. ఆమెను చాలా ప్రేమిస్తాడు. కానీ, ఆమె తరుచూ ఇతర పురుషులతో కలిసి పారిపోతుంటుంది. తిరిగి ఇంటికి వస్తుంటుంది. పెళ్లైన పదేళ్లలో ఆమె 25 సార్లు పారిపోయిందని స్వయాన భర్త మఫీజుద్దీన్ వివరించారు. తిరిగొచ్చిన ప్రతిసారీ ఇకపై అలా చేయనని తనకు వాగ్దానం చేస్తుందని, మళ్లీ అదే వాగ్దాన్ని బ్రేక్ చేస్తుందని తెలిపారు.

ఇలా పారిపోయి తిరిగి వచ్చినప్పుడల్లా తన బంధువుల ఇంటికి వెళ్లానని, అనారోగ్యంతో బాధపడుతున్న చుట్టాల దగ్గరకు వెళ్లినట్టు చెబుతుంటుందని అన్నారు. తమకు ముగ్గురు పిల్లల సంతానమున్నదని, వారి బాగోగుల కోసమైనా ఆమెను స్వీకరించకుండా ఎలా ఉండగలను అని ప్రశ్నించారు.

‘శనివారం నేను డ్రైవింగ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లేటప్పటికీ తమ మూడేళ్ల కుమారుడిని పక్కింటి వాళ్ల దగ్గర ఉంచి మళ్లీ పారిపోయినట్టు నా తండ్రి చెప్పాడు. మేకలకు మేత తీసుకు వస్తానని చెప్పి వెళ్లినట్టు నా భార్య చెప్పివెళ్లిందట. మళ్లీ ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో కూడా నాకు తెలియదు’ అని మఫీజుద్దీన్ అన్నారు. ఈ సారి రూ. 22 వేల నగదు, ఇంటి నుంచి ఇంకొన్ని వస్తువులనూ వెంటబెట్టుకుని వెళ్లినట్టు వివరించారు. అసలు ఆమె ఎవరితో వెళ్లిందో కూడా తనకు తెలియదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్