ముస్లిం యువతితో లవ్.. యువకుడి క్రూర హత్య.. ముక్కలుగా నరికేసిన ఆమె సోదరులు!

Published : Jun 14, 2023, 03:31 PM ISTUpdated : Jun 14, 2023, 03:36 PM IST
ముస్లిం యువతితో లవ్.. యువకుడి క్రూర హత్య.. ముక్కలుగా నరికేసిన ఆమె సోదరులు!

సారాంశం

ఓ హిందు యువకుడు, ముస్లిం యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆ యువతి కుటుంబానికి వీరి వ్యవహారం తెలిసి పలుమార్లు హెచ్చరించింది. కానీ, వారు తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  

హిమాచల్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హిందు యువకుడు, ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. కానీ, ముస్లిం యువతి కుటుంబానికి వీరి మధ్య సంబంధం అస్సలే ఇష్టం లేదు. పలుమార్లు హెచ్చరించారు కూడా. కానీ, వారు తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో జూన్ 6వ తేదీ నుంచి ఆ యువకుడు కనిపించలేదు. ఆ తర్వాత మూడు రోజులకు అతని బాడీ ముక్కలై మున్సిపాలిటీ చెత్తలో కనిపించింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లా గుజ్జర్ ప్రాబల్య ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, 21 ఏళ్ల మనోహర్, ఓ ముస్లిం యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరి మధ్య సంబంధం ఆ యువతి కుటుంబానికి తెలిసింది. పలుమార్లు వారించింది. వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ, వారి మధ్య సంబంధం మాత్రం కొనసాగింది. దీంతో ఆ యువతి సోదరులే మనోహర్‌ను చంపేసి ఉంటారనే అనుమానాలు నెలకొన్నాయి.

Also Read:ఆటో చార్జి విషయంలో గొడవ.. ఇద్దరు ప్రయాణికులను కత్తితో పొడిచిన డ్రైవర్.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

తల, కాళ్లు, చేతులు లేని మనోహర్  డెడ్ బాడీ పోలీసులకు లభించింది. ఆ బాడీని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ పంపించారు. ఈ నేరానికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ అభిషేక్ యాదవ్ వెల్లడించారు.

హిందూ జాగ్రన్ మంచ్ ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని కలిశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్