Hindi Diwas: మీ పద్యాలు, వాక్యాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి:ఆస్ట్రేలియన్ దౌత్యవేత్తల హిందీ అనుబంధంపై ప్రధాని

By Mahesh Rajamoni  |  First Published Sep 15, 2023, 12:44 PM IST

Hindi Diwas 2023: హిందీ దివాస్ సంద‌ర్భంగా ఆస్ట్రేలియా దౌత్యవేత్తలు తమకు ఇష్టమైన హిందీ సామెతలు, ప‌ద్యాలు, క‌విత‌లు చెబుతున్న వీడియోల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్పందిస్తూ ప్రశంసించారు. భారత్ లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓమ్ ఎక్స్ పోస్టుపై స్పందించిన ప్రధాని.. "మీ ఈ పద్యాలు, వాక్యాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి! ఆస్ట్రేలియన్ దౌత్యవేత్తలకు హిందీతో ఉన్న అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంది" అని పేర్కొన్నారు.
 


Hindi Diwas 2023: దేశవ్యాప్తంగా గురువారం (సెప్టెంబర్ 14) హిందీ దినోత్సవం జరుపుకున్నారు. హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక హిందీ దినోత్సవ శుభాకాంక్షలు' అని మోడీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. జాతీయ సమైక్యత, సుహృద్భావ దారాన్ని హిందీ భాష మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ క్ర‌మంలోనే భార‌త్ లోని ప‌లు దౌత్య కార్యాల‌యాల్లోని రాయ‌బారులు హిందీ దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. వారు హిందీలో ప్ర‌సంగించిన ప‌లు వీడియోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

బ్రిటన్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలు కూడా విభిన్న శైలిలో హిందీ దినోత్స‌వ‌ శుభాకాంక్షలు తెలిపాయి. హిందీ ప్రాముఖ్యతను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 న హిందీ దినోత్సవం జరుపుకుంటారు. హిందీ దివాస్ సంద‌ర్భంగా ఆస్ట్రేలియా దౌత్యవేత్తలు తమకు ఇష్టమైన హిందీ సామెతలు, ప‌ద్యాలు, క‌విత‌లు చెబుతున్న వీడియోల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్పందిస్తూ ప్రశంసించారు. భారత్ లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓమ్ ఎక్స్ పోస్టుపై స్పందించిన ప్రధాని.. "మీ ఈ పద్యాలు, వాక్యాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి! ఆస్ట్రేలియన్ దౌత్యవేత్తలకు హిందీతో ఉన్న అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంది" అని పేర్కొన్నారు.

Latest Videos

 

आपके ये दोहे और मुहावरे मंत्रमुग्ध करने वाले हैं! ऑस्ट्रेलिया के राजनयिकों का हिन्दी के प्रति ये लगाव बेहद ही दिलचस्प है। https://t.co/N9DCdtk6cd

— Narendra Modi (@narendramodi)

భారతదేశంలోని బ్రిటిష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐదు ఇష్టమైన హిందీ పదాలను పంచుకున్నారు.
 

Here are some of High Commissioner ’ favourite 🇮🇳 phrases, songs and movies. pic.twitter.com/TXzGc7AbY3

— UK in India🇬🇧🇮🇳 (@UKinIndia)
click me!