
షిమ్లా: హిమాచల్ ప్రదేశ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వేళ చిన్నారి బాలుడైనా, బాలికైనా దత్త తీసుకుంటే.. సదరు రెగ్యులర్ మహిళా ఉద్యోగస్తులకు ఈ వెసులుబాటు ఉందని సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. సీఎం జై రామ్ ఠాకూర్ సారథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయినట్టు పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఈ నిర్ణయంతోపాటు మరికొన్ని విధానపరమైన అంశాలపై డెసిషన్స్ తీసుకున్నారు.
ముఖ్యమంత్రి శోధ్ ప్రోత్సాహన్ యోజనా సహా మరికొన్ని ప్రాజెక్టులకు ఆ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి శోధ్ ప్రోత్సాహన్ యోజనా కింద పరిశోధకులకు నెలకు రూ. 3000 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మూడు సంవత్సరాల కాలం వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. యువత నాణ్యమైన పరిశోధన విధానాలు అందుకోవాలనే లక్ష్యంతోనే ఈ స్కీంను గవర్నమెంట్ రూపొందించింది.
అలాగే, బిలాస్‌పూర్ జిల్లా సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎయిమ్స్‌కు సెక్యూరిటీ ఇవ్వడానికి కొత్త పోలీసు పోస్టును ప్రవేశపెట్టడాన్నీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తద్వారా వేర్వేరు కేటగిరీల్లో ఆరు కొత్త పోస్టుల సృష్టికి దోహదపడింది.
అంతేకాదు, జై రామ్ ఠాకూర్ రాష్ట్ర క్యాబినెట్ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌నూ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా గందరగోళమైన పార్కింగ్, ఆటోమొబైల్ రిపేర్లు షాపులు భూ కబ్జా చేయకుండా పరిష్కారం లభించినట్టయింది.