రాష్ట్ర మాతగా ఆవు.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

By ramya neerukondaFirst Published Dec 14, 2018, 1:13 PM IST
Highlights

గోమాతను రాష్ట్రమాతగా గుర్తిస్తూ.. హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.  ఆవును రాష్ట్రమాతగా అంగీకరించాలని కోరుతూ.. బీజీపీ ఎమ్మెల్యే అనిరుధ్ సింగ్ ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర శాసన సభ శుక్రవారం ఆమోదించింది.

గోమాతను రాష్ట్రమాతగా గుర్తిస్తూ.. హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.  ఆవును రాష్ట్రమాతగా అంగీకరించాలని కోరుతూ.. బీజీపీ ఎమ్మెల్యే అనిరుధ్ సింగ్ ప్రవేశపెట్టిన బిల్లును రాష్ట్ర శాసన సభ శుక్రవారం ఆమోదించింది.  అనంతరం ఆ బిల్లును కేంద్రానికి పంపింది. 

గోమాత కేవలం ఓ కులానికి, మతానికి చెందినది కాదని.. అది జాతి సంపదని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వీరేంద్ర కన్వార్ తెలిపారు. చాలా మంది పాలు ఇస్తున్నంత కాలమే గో సంరక్షణ చేస్తున్నారని.. ఆ తర్వాత వాటిని వధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో గో సంరక్షణ చేపట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు. గతంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు ఆవును రాష్ట్రమాతగా గుర్తిస్తూ.. తొలిసారి తీర్మానం చేశారు. 

click me!