
కర్నాటక (karnataka)లో చెలరేగిన హిజాబ్ (hijab) వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెల రోజుల కిందట ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కర్నాటకలోని చాలా చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని రోజుల పాటు స్కూల్స్ ను, కాలేజీలను మూసివేశారు. చివరికి ఈ విషయం కోర్టు వరకు వెళ్లింది.
అయితే ఈ హిజాబ్ ఇష్యూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కాంగ్రెస్ (congress) నాయకుడు ముకర్రం ఖాన్ (Mukarram Khan)ను పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ‘‘హిజాబ్‌ను వ్యతిరేకించిన వారిని ముక్కలుగా నరికివేస్తాం ’’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. దీంతో కలబుర్గి (Kalaburgi) జిల్లా పోలీసులు మంగళవారం హైదరాబాద్ (Hyderabad)కు వచ్చి ఆయనను అదుపుతోకి తీసుకున్నారు. అతడిని త్వరలోనే కోర్టు ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. ఈ విషయంలో సేడం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 (A), 298, 295 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ వైరల్ వీడియోలో... ‘‘ మేము ఇక్కడ పుట్టి పెరిగాము. మేము భారతదేశంలోనే జీవిస్తాం. మా జీవితాలను ఇక్కడే ముగించుకుంటాం. హిజాబ్‌లు ధరించడాన్ని వ్యతిరేకించే వారిని ముక్కలుగా నరికివేస్తాం.ఒక రోజు మనం (అందరం) చనిపోతాము. కానీ మా కులాన్ని (మతాన్ని) బాధించవద్దు. అన్ని కులాలు సమానమే. ఏ కులమూ అన్యాయానికి గురికాకూడదు. మీరు ఏదైనా ధరించవచ్చు. నిన్ను ఎవరు ఆపుతారు? దీన్ని మేము సహించబోము ” అంటూ మాట్లాడారు.
కర్నాటకలోని ఉడిపి (udipi) జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలలో కొంతమంది విద్యార్థులను హిజాబ్ ధరించి.. తరగతులకు హాజరు కాకుండా నిరోధించారని ఆరోపించడంతో జనవరిలో హిజాబ్ అంశం వివాదాస్పదం అయింది. కాషాయ కండువాలు ధరించిన కొందరు విద్యార్థులు కాలేజీలకు రావడంతో పాటు హిజాబ్ లను లేకుండా తరగతులకు హాజరుకావాలని పేర్కొనడంతో ఈ వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే అక్కడి విద్యాసంస్థలు హిజాబ్ లేకుండా తరగతులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలలోకి రావడానికి ప్రయత్నించగా.. అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించాలని, ఇతర మతపరమైన ఆచారాలను కాలేజీల్లో అనుమతించబోమని ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేయడంతో వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. అప్పటి నుంచి ఇది మరింతగా ముదిరి కర్నాటక (Karnataka) నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది.
హిజాబ్ వివాదంలో తలదూర్చి, న్యాయవాదిపై కామెంట్స్ చేసిన ఘటనలో ప్రముఖ కన్నడ నటుడు చేతన్ కుమార్ (chetan kumar) కూడా గత నెలలో హాజరయ్యారు. విద్యాసంస్థల్లో హిజాబ్ (hijab) నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న బెంచ్‌లో భాగమైన కర్ణాటక (karnataka) హైకోర్టు (high court) న్యాయమూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే న్యాయమూర్తిపై ట్వీట్ చేసినందుకు దీనిని సుమోటాగా స్వీకరించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు