పెళ్లి పీటల మీదినుంచి వరుడు పరార్.. ఇంటి ముందు వధువు ధర్నా...

Published : Mar 08, 2022, 01:29 PM ISTUpdated : Mar 08, 2022, 01:30 PM IST
పెళ్లి పీటల మీదినుంచి వరుడు పరార్.. ఇంటి ముందు వధువు ధర్నా...

సారాంశం

ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. అన్న పెళ్లి కావాలని నమ్మబలికాడు.. డబ్బులు తీసుకుని.. పెళ్లి పీటల మీదినుంచి కనిపించకుండా పోయాడు. దీంతో షాక్ అయిన వధువు అతని ఇంటిముందు ధర్నాకు దిగింది.

చిత్తూరు : ఆ అమ్మాయి వివాహం గురించి ఎన్నో కలలుకంది. తనకు కాబోయే భాగస్వామి దొరికాడని సంతోషించింది. అయితే సప్తపదిని పలికేందుకు కొన్ని గంటల సమయం ముందు bridegroom పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయి marriage hallలో విషాదం నెలకుంది. సంఘటన chennai నగరపరిధిలోని తాంబరంలో జరిగింది. వరుడికి చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారపల్లె. దీంతో తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పూర్తి వివరాల్లోకి వెడితే.. నిమ్మనపల్లె మండలం చౌకిళ్లవారిపల్లెకు  చెందిన వెంకటరమణ చిన్న కుమారుడు కేదార్నాథ్ (32) బతుకుతెరువు కోసం 15 ఏళ్ల క్రితమే చెన్నైకి వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో చందన (25) అనే యువతితో పరిచయమై అది కాస్తా ప్రేమగా మారింది. వివాహంచేసుకోవాలని కోరింది. తన  అన్నకు వివాహం కావాలని ఆ తర్వాతనే మన వివాహం అని నమ్మబలికాడు . రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి ఆమె దగ్గర తీసుకున్నాడు. అన్న పెళ్లి అయిపోయింది. ఇక మన వివాహం అంటూ ఫిబ్రవరి 21వ తేదీని ఖరారు చేశాడు.  

దీంతో వధువు తరఫున తల్లిదండ్రులు కళ్యాణ మండపాన్ని బుక్ చేసుకున్నారు. తీరా తాళికట్టే సమయంలో పెళ్లి పీటల నుంచి పరారయ్యాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. తాంబరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత గాలించినా కేదారినాథ్ కనిపించకపోవడంతో సోమవారం కేదార్ నాథ్ సొంతూరు చౌకిళ్లవారిపల్లెకు వధువు, బంధువులు చేరుకున్నారు. అప్పటికే ఇంటికి తాళం వేసుకుని ఇంటి నుంచి కుటుంబ సభ్యులతో సహా పరారయ్యారు. అదే ఇంటి ముందు వధువు ధర్నాకు దిగింది. కేదార్ నాథ్ తనను కూడా మోసం చేశాడని మరో అమ్మాయి నిమ్మనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేదార్నాథ్ ను పట్టుకుని తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కోరింది. 

ఇదిలా ఉండగా, ఈ నెల మొదట్లో  పెళ్లిలో చోటుచేసుకున్న ఓ ఘటన ఓ షాకింగ్ వీడియో  నెట్టింట్లో వైరల్ గా మారింది. కోపంతో ఊగిపోయిన bridegroom,   ఒక్కసారిగా వధువు చెంపపై లాగి ఒక్కటిచ్చాడు. వివరాల్లోకి వెళితే..పెళ్లి తర్వాత దండలు మార్చుకునే సందర్భంలో వరుడు, వధువు ఎదురెదురుగా నిల్చుని ఉన్నారు. ఇంతలో వధువుకి  వరుడు స్వీట్ తినిపిస్తుండగా ఆమె నిరాకరించింది. దీంతో అతను స్వీట్ ను కోపంతో పెళ్లికూతురు మొహంపై విసిరాడు. పెళ్లి కొడుకు చేసిన పనికి కోపం తెచ్చుకున్న వధువు కూడా స్వీట్స్ ను అతని ముఖంపై విసిరింది. ఇంకేముంది అప్పటికే కోపంతో రగిలి పోతున్న వరుడికి ఆవేశం మరింత ఎక్కువైంది. అంతే పెళ్లికి వచ్చిన అతిథులందరి ముందే పెళ్లికూతురు చెంప చెల్లుమనిపించాడు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 23,000 లైకులు,  పదిహేను వందల కామెంట్లు వచ్చి చేరాయి. అయితే కొంతమంది వీడియోని చూసి నవ్వుకుంటుంటే, మరికొంతమంది వధువును కొట్టే అధికారం వరుడికి లేదంటూ కామెంట్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !