ఢిల్లీలో కలకలం.. విదేశీయురాలి కుళ్లిన మృతదేహం లభ్యం...

By SumaBala BukkaFirst Published Mar 18, 2023, 11:15 AM IST
Highlights

ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలో  కుళ్లిపోయిన స్థితిలో ఓ విదేశీ మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలం నుంచి మహిళ పాస్‌పోర్టు, ఇతర పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ : ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఢిల్లీ, గీతా కాలనీ ప్రాంతంలో బాగా కుళ్లిపోయిన స్థితిలో ఓ విదేశీయురాలి మృతదేహాన్ని శుక్రవారం ఢిల్లీ పోలీసులు గుర్తించారు. గీతానగర్ ప్రాంతంలోని అండర్‌పాస్ సమీపంలో మృతదేహం లభ్యమైందని ఏఎన్ఐ తెలిపింది. ఈ ఘటనపై డీసీపీ షహదారా రోహిత్ మీనా మాట్లాడుతూ, మృతురాలి వయస్సు 60 ఏళ్లు పైబడి ఉంటుందని అన్నారు. సంఘటనా స్థలం నుంచి పాస్‌పోర్టు, ఇతర పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది. 

ఇదిలా ఉండగా, ఇలాంటి మరో సంఘటనలో, నోయిడా పోలీసులు గురువారం నాడు నగరంలోని ఒక కాలువలో ఒక వ్యక్తి కాళ్ళు, చేతులు దొరికాయి. దీంతో స్థానికంగా కలకలం రేగింది. దీనిమీద దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.సెక్టార్ 8లోని ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు నుంచి మూడు అడుగుల వెడల్పు ఉన్న డ్రైన్‌లో ఈ అవయవాలు ఉదయం 10 గంటలకు కనిపించాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నోయిడా) హరీష్ చందర్ పిటిఐకి తెలిపారు.

రాంచీ-పూణె ఇండిగో విమానం నాగ్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుడి మృతి..

“ఈ విషయం ఫేజ్ 1 పోలీస్ స్టేషన్‌ లో రిపోర్ట్ చేయబడింది. ఆ  తర్వాత ఫోరెన్సిక్ బృందంతో పాటు పోలీసు అధికారులు తదుపరి దర్యాప్తు కోసం స్థలాన్ని సందర్శించారు. ఆ అవయవాలు నాలుగైదు రోజుల క్రితం చనిపోయిన వ్యక్తివిగా గుర్తించారు. ఆ శరీర భాగాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’’ అని చందర్ తెలిపారు.

"శరీర భాగాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఆ రిపోర్టు ఆధారంగా ఈ కేసులో చర్యలు తీసుకుంటాం" అని అధికారి తెలిపారు. బాధితురాలిని గుర్తించడం వంటి మరిన్ని వివరాలను పోలీసులు ఇంకా రూపొందించాల్సి ఉందని, దాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

click me!