24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా: ఇండియాలో మొత్తం కేసులు 28,36,925కి చేరిక

By narsimha lodeFirst Published Aug 20, 2020, 10:18 AM IST
Highlights

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారంనాడు దేశంలో 69,652 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు ఇదే అత్యధికం. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28, 36,925కి చేరుకొంది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారంనాడు దేశంలో 69,652 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు ఇదే అత్యధికం. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28, 36,925కి చేరుకొంది.

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6 లక్షల 86 వేల 395 ఉన్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు  20 లక్షల 96 వేల 665 మంది కోలుకొన్నారు. కరోనాతో దేశంలో ఇప్పటివరకు 53, 866 మంది మరణించారు.

also read:సీసీఎంబీ షాకింగ్ సర్వే: హైద్రాబాద్ మురుగునీటిలో కరోనా ఆనవాళ్లు

దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 26 లక్షల 252 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. గత 24 గంటల్లో 977 మంది కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో 9 లక్షల 18 వేల 470 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నుండి కోలుకొంటున్న రోగుల  సంఖ్య74 శాతానికి చేరింది.ఇక కరోనాతో మరణించిన రోగుల శాతం 1.9గా  ఉన్నట్టుగా కేంద్ర  వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
 

click me!